క్రీడాభూమి

పాకిస్తాన్‌కు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ: టి-20 వరల్డ్ కప్‌లో రేసులోనే ఉండడమేగాక, భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాభవంతో స్వదేశంలో పెల్లుబుకుతున్న అభిమానుల ఆగ్రహం నుంచి బయటపడేందుకు కూడా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ తలపడనుంది. ‘అండర్ డాగ్’ ముద్రతో బరిలోకి దిగినప్పటికీ ఈ టోర్నీలో న్యూజిలాండ్ అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నది. పటిష్టమైన భారత్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. అది అదృష్టవశాత్తు లభించిన విజయం కాదని నిరూపించే విధంగా ఆస్ట్రేలియాను కూడా చిత్తుచేసింది. అదే ఫామ్‌ను కొనసాగించి, పాకిస్తాన్‌ను కూడా ఓడించాలన్న పట్టుదలతో ఉంది. ఈ జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుంటే, పాక్ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన పరాజయం ఆ జట్టును ఆత్మరక్షణలో పడేసింది. చిరకాల ప్రత్యర్థి భారత్‌ను వరల్డ్ కప్, టి-20 ప్రపంచ కప్ టోర్నీల్లో 11వ సారి ఎదుర్కొన్న పాక్ అందుకు ముందు పది మ్యాచ్‌ల్లో మాదిరిగానే ఈసారి కూడా ఓటమిపాలైంది. భారత్ విజృంభణకు పాక్ ఆటగాళ్లు అడ్డుకట్ట వేయలేకపోయారని, పైగా జట్టు మేనేజ్‌మెంట్ తప్పుడు వ్యూహాలతో ఓటమిపాలైందని అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా ధ్వజమెత్తుతున్నారు. స్వదేశంలో నిరసన జ్వాలలు మరింతగా పెరగకుండా ఉండాలంటే న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాలి. ఈ లక్ష్యంతోనే షహీద్ అఫ్రిదీ సేన పరీక్షకు సిద్ధమవుతున్నది. ఈ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిని రేపుతున్నది.

బౌలింగ్‌కు అనుకూలం
హెచ్‌పిసిఎ పిచ్‌పై మిథాలీ అంచనా
ధర్మశాల, మార్చి 21: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎల్) పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంచనా వేసింది. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా కనిపించడం లేదని, దీనితో బంతి బాగా స్పిన్ అవుతుందని అనుకుంటున్నట్టు మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న మిథాలీ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కి వర్షం వల్ల అంతరాయం ఏర్పడడంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో రెండు పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు మరోసారి ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. ఈ విషయాన్ని మిథాలీ ప్రస్తావిస్తూ, అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగానే ఉందని చెప్పింది. ఇంగ్లాండ్ కూడా బలమైన జట్టు కాబట్టి పోరు హోరాహోరీగా ఉంటుందని మిథాలీ అన్నది. జట్టులోకి చాలా మందికి ధర్మశాలలో మ్యాచ్ ఆడడం ఇదే మొదటిసారి అవుతుందని చెప్పింది. పిచ్ ఏ విధంగా మారుతుందో చెప్పలేమని, పైగా వాతావరణం ఏ విధంగా ఉంటుందో అన్న అంశంపై పిచ్ తీరు ఆధారపడి ఉంటుందని తెలిపింది. కాగా, కాగితంపై చూస్తే ఇరు జట్లు సమవుజ్జీగా కనిపిస్తున్నాయి. దీనితో మంగళవారం నాటి మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశాలున్నాయి.