క్రీడాభూమి

తడబడినా గెలిచిన ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: బంగ్లాదేశ్‌తో సోమ వారం జరిగిన టి-20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై సునాయాసంగా గెలిచే అవకా శం ఉన్నప్పటికీ తడబడి, వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా చివరికి 3 వికెట్ల తేడాతో విజ యం సాధించింది. 157 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ అందుకుంది.
టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే సౌమ్య సర్కార్ (1) తొలి వికెట్‌ను చేజార్చుకుంది. సబ్బీర్ కుమార్ (12) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే, మహమ్మద్ మిథున్ (23), షకీబ్ అల్ హసన్ (33) బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. హువగత హొమ్ 13 పరుగులకు అవుట్‌కాగా, చివరిలో మహమ్మదుల్లా (49 నాటౌట్) వేగంగా స్కోరును ముందుకు దూకించాడు. ముష్ఫికర్ రహీం (15 నాటౌట్) కూడా అతనికి జత కలవడంతో, బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 23 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. షేన్ వాట్సన్ 31 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
ఆస్ట్రేలియాకు ఓపెనర్లు షేన్ వాట్సన్, ఉస్మాన్ ఖాజా చక్కటి ఆరంభాన్నిచ్చారు. 62 పరుగుల స్కోరువద్ద షేన్ వాట్సన్ వికెట్ కూలింది. అతను 15 బంతుల్లో 21 పరుగులు చేసి రనౌటయ్యా డు. ఉస్మాన్ ఖాజా 58 పరుగులు సాధించగా, గ్లెన్ మాక్స్‌వెల్ 26 పరుగులు చేశాడు. మొత్తం మీద ఆస్ట్రేలియా ఇంకా 9 బంతులు మిగిలి ఉం డగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒ కానొక దశలో బంగ్లాదేశ్ బౌలర్ షకీబ్ అల్ హ సన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఆసీ స్‌ను కంగారెత్తించాడు. కానీ, అప్పటికే విజయ ముంగిట నిలవడంతో ఆసీస్ పెద్దగా నష్టం లే కుండా గెలిచింది.