బిజినెస్

సిక్కోల్‌లో అంతర్జాతీయ రొయ్యల కేంద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల పొడవునగల సముద్రతీరాన్ని పారిశ్రామిక కారిడార్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలో తొలి అడుగు పడింది. సముద్రతీరాన్ని ఆదాయ వనరులుగా మార్చుకుని మరింత అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఒకవైపు ప్రైవేటు భాగస్వామ్యంతో భావనపాడు పోర్టు నిర్మాణానికి కసరత్తు ముమ్మరం చేస్తూ, మరోవైపు ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి ఆనుకుని సముద్ర తీరంలో అంతర్జాతీయ మార్కెట్‌లో గొప్ప గిరాకీ గల ‘వెనామీ’ తల్లిరొయ్య కేంద్రం ఏర్పాటుకు థాయ్‌లాండ్‌తో ఎంఒయు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా థాయ్‌లాండ్ ప్రతినిధుల బృందం కుప్పిలి సముద్రతీరంలో 30 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ, సర్వే నిర్వహించారు. గత రెండు రోజులుగా సర్వే నెం. 505లో 30 ఎకరాల సాల్ట్‌ల్యాండ్‌లో రొయ్యల చెరువులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ప్రభుత్వ విలువతో ఆ భూములను ఎకరాకు పది లక్షల రూపాయలు చొప్పున చెల్లించి థాయ్‌లాండ్ ప్రతినిధుల బృందం ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో ఆక్వా పరిశ్రమను కుదేలెత్తించే వైరస్ నుంచి కాపాడేందుకు తల్లిరొయ్య వెనామీ ఉత్పత్తి కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడంతో ఇక్కడ భావనపాడు పోర్టుకు అనుసంధానంగా ఈ ఆక్వా పరిశ్రమ నెలకొల్పుతారు. జిల్లాలో ప్రస్తుతం 1,000 హెక్టార్లలో ఆక్వా పరిశ్రమ నడుస్తోంది. ఎచ్చెర్ల, గార, సోంపేట, పలాస, ఇచ్చాపురం, కవిటి, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాల్లో రొయ్యల చెరువులు ఉన్నప్పటికీ ఏటా పిల్ల రొయ్యలకు వైరస్ సోకి ఆ పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేస్తోంది. ఇటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు ‘వెనామీ’ తల్లిరొయ్యల కేంద్రం ఏర్పాటు చేయడంతో వైరస్ నుంచి ఆక్వా పరిశ్రమను రక్షించేలా ఈ పరిశ్రమను థాయ్‌లాండ్ ప్రభుత్వంచే శ్రీకాకుళంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. మొత్తానికి అంతర్జాతీయ మార్కెట్‌లో గొప్ప గిరాకీ గల వెనామీ రొయ్యల ఉత్పత్తి కేంద్రం పేరిట పేటెంట్ హక్కులు థాయ్‌లాండ్ ప్రతినిధులు పొంది భారతదేశంలో ఆక్వారంగంపై పట్టుసాధించేందుకు సన్నద్ధం అవుతున్నారు. కాగా, ఈ పరిశ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా మే నెలలో ప్రారంభోత్సవం జరుగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రా-్థయ్‌లాండ్ ఎంఒయులో భాగంగా వౌలిక సదుపాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతలు స్వీకరించింది.