బిజినెస్

ఆర్థిక సంస్కరణలతోనే వృద్ధిరేటు పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల మధ్య ఆర్థిక సంస్కరణలతో భారత జిడిపి వృద్ధిరేటు అదనంగా 1-2 శాతం పెరగగలదన్న విశ్వాసాన్ని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. మైనారిటీల ఆర్థిక సాధికారతపై 8వ వార్షిక ఎన్‌సిఎమ్ ప్రధానోపన్యాసం చేస్తూ అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు కలిసొచ్చేవేనని అన్నారు. ‘నేడు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితి భారత్‌కు గొప్ప అవకాశంగా నేను అనుకుంటున్నాను.’ అని అన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం, అదుపులో ఉన్న మినరల్, కమాడిటీ ధరలు.. నిజంగా వాటి దిగుమతిపై ఆధారపడే దేశాలకు వరంగా జైట్లీ అభివర్ణించారు. ఈ పరిణామం ఉత్పాదక దేశాల సంపదను వినియోగ దేశాలకు రప్పిస్తోందన్నారు. ఇప్పటికే భారత్ ఈ దిశగా లాభం పొందిందని చెప్పారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉందని, కొన్ని దేశాలు మాంద్యం అంచుల్లో ఉన్నాయన్న ఆయన అయినప్పటికీ భారత్ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉందని అన్నారు. ఆర్థిక సంస్కరణలతో వృద్ధిరేటును మరింతగా పెంచుకోవచ్చన్నారు. కాగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే ఇటీవల భారత్‌లో పర్యటించిన సందర్భంగా భారత్‌ను ఓ ధ్రువతారగా అభివర్ణించినది తెలిసిందే. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ అబ్బురపరిచే వృద్ధిరేటును నమోదు చేస్తోందన్నారు. వచ్చే నెల ఏప్రిల్‌తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 7-7.75 శాతం మధ్య ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసినది తెలిసిందే.

ఎన్‌సిఎమ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న జైట్లీ

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి, మార్చి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ కేవలం 7.07 పాయింట్లు అందిపుచ్చుకుని 25,337.56 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 1.60 పాయింట్లు పెరిగి 7,716.50 వద్ద నిలిచింది. లోహ, టెక్నాలజీ, ఐటి రంగాల షేర్ల విలువ 1.71 శాతం నుంచి 0.61 శాతం వరకు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా మార్కెట్లు ఆరంభంలో లాభాల్లో కదలాడాయి. గత 3 రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నది తెలిసిందే.
నాలుగు రోజులు సెలవు
దేశీయ స్టాక్ మార్కెట్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులొచ్చాయి. గురువారం హోలీ సందర్భంగా మూతబడితే, శుక్రవారం గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని సూచీలకు సెలవు. శనివారం, ఆదివారం ఎప్పటిలాగే ట్రేడింగ్ బంద్ అవగా, మళ్లీ సోమవారమే తిరిగి స్టాక్ మార్కెట్ల కార్యకలాపాలు సాగనున్నాయి. ఫారెక్స్, మనీ, ఇతర కమాడిటీ మార్కెట్ సైతం ఈ నాలుగు రోజులు మూతపడనున్నాయి.
సిఐఐ సదరన్ రీజియన్
చైర్మన్‌గా రమేశ్ దాట్ల
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 23: భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) దక్షిణాది ప్రాంతీయ విభాగం చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన ఎలికో లిమిటెడ్ సిఎండి రమేశ్ దాట్ల ఎన్నికయ్యారు. వచ్చే 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రమేశ్ దాట్లను చైర్మన్‌గా ఎన్నుకోగా, డిప్యూటి చైర్మన్‌గా టొయోట కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ ఎన్నికైయ్యారు. చెన్నైలో బుధవారం సిఐఐ దక్షిణ ప్రాంతీయ మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్నిక వివరాలను సిఐఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, రమేశ్ దాట్ల ప్రస్తుతం సిఐఐ దక్షిణాది విభాగం డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సిఐఐ జాతీయ మండలిలో 2012 నుంచి సభ్యుడిగా వ్యవహరిస్నున్న విక్రమ్ ఇప్పుడు డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైయ్యారు.
సనోఫి ఇండియా చైర్మన్ పదవికి
గుడ్‌బై చెబుతున్న మాల్యా
న్యూఢిల్లీ, మార్చి 23: సనోఫి ఇండియా చైర్మన్‌గా తాను పదవీవిరమణ పొందుతున్నట్లు విజయ్ మాల్యా బుధవారం ప్రకటించారు. మళ్లీ డైరెక్టర్ పదవి కోసం ఆశించడం లేదన్నారు. బ్రిటన్‌లో తన కుటుంబంతో ఎక్కువకాలం గడపాలన్న కోరికతోనే పదవులకు దూరంగా ఉంటున్నట్లు మాల్యా పునరుద్ఘాటించారు. సనోఫి ఇండియా చైర్మన్‌గా 32 ఏళ్లుగా ఉన్న మాల్యా.. డైరెక్టర్‌గా 42 ఏళ్లకుపైగా ఉన్నారు. వచ్చే నెల ఏప్రిల్ చివర్లో జరిగే సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్‌గా మాల్యా తప్పుకున్నది తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో మాల్యా కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు.
ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై
రాయితీని తగ్గించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్ర ప్రభుత్వం బుధవారం ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై రాయితీని తగ్గించింది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పతనం నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై ఇచ్చే రాయితీని తగ్గించగా, దీనివల్ల ఖజానాకు దాదాపు రూ. 5,000 కోట్ల్లు ఆదా కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో 2016-17 రాయితీ భారం 21,274 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.