బిజినెస్

ఎదురుచూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: రైతులు, చేనేత కార్మికులు రుణమాఫీ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రైతులకు 2014 డిసెంబర్‌లో మొదటి విడత రుణమాఫీ నిధులు విడుదలవగా, చేనేతలకు సంబంధించి మాత్రం ఇప్పటికీ ఆ శాఖ జాబితా తయారీలోనే తలమునకలై ఉంది. దీంతో రుణమాఫీకి అర్హత సాధించిన రైతులు, చేనేత రుణమాఫీలో అర్హత కోసం చేనేత కార్మికులు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జిల్లాలోని పలువురు రైతులకు పంట రుణమాఫీ మొదటి విడత నిధులు 2014 డిసెంబర్‌లో విడుదల కాగా రెండవ విడత నిధులు 2015 డిసెంబర్‌లో విడుదల అవుతాయని భావించారు. అయితే నేటికీ ఆ నిధులు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే నిధుల లేమితో పంట రుణమాఫీని విడతల వారీగా చేపట్టాలని నిర్ణయించింది. దీంతో రుణమాఫీకి అర్హత సాధించిన రైతులకు ఐదు విడతలుగా మాఫీ నిధులను వడ్డీతో సహా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయతే రెండవ విడతలోనే విడుదల చేయాల్సిన నిధులపై ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లాలో 7,99,307 మంది రైతులు రుణమాఫీకి అర్హత సాధించారు. ఇందులో రూ. 20 వేల రుణం ఉన్న ఖాతాలు 1,93,619 ఉండగా రూ. 20 వేల నుంచి రూ. 50 వేల రుణం ఉన్న ఖాతాలు 3,28,944 ఖాతాలు ఉన్నాయి. రుణమాఫీ నిబంధనల ప్రకారం రూ. 50 వేల లోపు రుణం ఉన్న రైతులకు అందరికీ ఒకే విడతలోనే మాఫీ చేయాల్సి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా రూ. 50 వేల లోపు రుణం ఉన్న రైతులకు ఒకే విడతలో మాఫీ కాకపోవడం గమనార్హం. ఇక రూ. 50 వేల నుంచీ రూ. లక్ష లోపు రుణం ఉన్న ఖాతాలు 2,14,430, రూ. లక్ష పైబడి రుణం ఉన్న ఖాతాలు 62,314 ఉన్నాయి. వీరందరికీ పంట రుణం లేదా వ్యవసాయ ఆధారిత బంగారు ఆభరణాల తాకట్టు రుణాలకుగానూ తొలి విడతలో నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం 2,76,744 మంది రైతులకు రెండవ విడత నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులు వస్తాయని 2015 డిసెంబర్ నుంచే రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ విషయమై అటు ప్రభుత్వ యంత్రాం గం, ఇటు బ్యాంకర్లలో ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు ఇన్‌పుట్ సబ్సిడీ సైతం పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. మార్చి బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం ఏప్రిల్‌లోనైనా రెండవ విడత నిధులు విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
చేనేత కార్మికుల పరిస్థితి దారుణం
మరోవైపు చేనేత కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలో వ్యవసాయ రంగం తరువాత అత్యధిక శాతం మంది చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారే. ప్రభుత్వం వీరికి సైతం రుణమాఫీ చేస్తామని ప్రకటించగా, ఇప్పటికీ తర్జనభర్జనలు, జాబితా తయారీలో మార్పులు, చేర్పులతోనే కాలయాపన జరుగుతోంది తప్పించి ఇప్పటికీ తుది జాబితా తయారు కాలేకపోయంది. దీంతో రుణాలు తీసుకున్న నేతన్నలు బ్యాంకర్ల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. జిల్లాలో చేనేత రుణమాఫీకి సంబంధించి మొదట్లో రూ. 58 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా తాజాగా అది రూ. 38 కోట్లకు పడిపోయింది. ప్రభుత్వానికి జాబితా పంపిన ప్రతిమారూ పలు రకాల నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల అర్హుల జాబితాలో మార్పులు, రుణమాఫీ మొత్తంలో కోతలు పడుతూ వచ్చాయి. జిల్లా చేనేత జౌళి శాఖ 2013 మార్చి 31వ తేదీ వరకూ చేనేతలు తీసుకున్న రుణాల జాబితాను తయారుచేసింది. ఇందులో మొదటి విడతలో రూ. 58,14,33,673 గా నిర్ణయించి జాబితాను తయారుచేసి పంపించింది. ఈ జాబితాను పరిశీలించిన ప్రభుత్వ వర్గాలు మరిన్ని నియమ నిబంధనలు చేర్చడంతో రెండవ విడతలో అర్హుల జాబితాను తయారుచేసి పంపించింది. ఇందులో వ్యక్తిగత రుణాలు 10,226 మందికి సంబంధించి రూ. 34,77,84,156, గ్రూపుల ద్వారా రుణాలు 198 మందికి సంబంధించి రూ. 4,02,81,493 తీసుకున్నట్లు గుర్తించింది. మొత్తంగా 10,424 మందికి చెందిన రూ. 38,80,65,649 రుణమాఫీకి అర్హమైనదిగా గుర్తించి జాబితాను తయారుచేసి పంపించింది. అయితే ఇందులో సైతం మరిన్ని కొర్రీలు వేయడంతో మళ్లీ జాబితా తయారు చేసే పనిలో పడింది. అందులో భాగంగా జిల్లా చేనేత జౌళి శాఖ వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారు 10,119 మందిగా గుర్తించి వారి రుణమాఫీ మొత్తం రూ. 34,60,35,927, గ్రూపుల ద్వారా తీసుకున్న వారు 205 మందిగా గుర్తించి రూ. 3,93,14,425 గుర్తించి మొత్తంగా 10,324 మందిని అర్హులుగా గుర్తించి వారికి సంబంధించి రూ. 38,53,37,352తో జాబితాను తయారుచేసి పంపించింది. ఇందు లో సైతం 4వేలకు పై చిలుకు ఖాతాలు మిస్ మ్యాచింగ్ కావడంతో వాటిని సరిచేసి పంపాలని కమిషనర్, చేనేత జౌళి శాఖ నుంచి జాబితా వెనక్కు వచ్చింది. అయితే ప్రభుత్వం జనవరి 1వ తేదీ చేనేత రుణమాఫీ జాబితాను జిల్లా లెవల్ కమిటీ(డిఎల్‌సి) సర్టిఫై చేసి పంపాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికీ జాబితా తయారీ, ఆధార్ కార్డుల వెరిఫికేషన్ తదితర పనులతో జాబితాలో జాప్యం జరుగుతూనే వస్తోంది. ఇలా జిల్లాలోని రైతులు, చేనేత కార్మికులు రుణమాఫీ నిధుల కోసం పడిగాపులు కాస్తున్నారు.