బిజినెస్

నగదు వద్దు.. బంగారమే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి: ప్రధాన మంత్రి పసిడి నగదీకరణ పథకంలో టన్నులకొద్దీ బంగారాన్ని డిపాజిట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి).. ఇందుకు వడ్డీని నగదు కంటే బంగారం రూపంలోనే కావాలంటోంది. పసిడి నగదీకరణ పథకంలో భాగంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో బంగారాన్ని టిడిడి డిపాజిట్ చేస్తుండగా, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన టిటిడి వద్ద 7 టన్నుల పుత్తడి ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది 277 మిలియన్ డాలర్ల (డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం 1,850 కోట్ల రూపాయలు)కు సమానం. ఈ క్రమంలో మూడేళ్లకు మించిన డిపాజిట్లపై వడ్డీ తమకు తిరిగి బంగారం రూపంలోనే అందివ్వాలని ప్రభుత్వాన్ని టిటిడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి సాంబశివ రావు కోరుతున్నారు. బుధవారం ఆయన న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌తో మాట్లాడారు. ఈ రకమైన వెసులుబాటుతో దేశంలోని మిగతా ఆలయాలు సైతం బంగారాన్ని డిపాజిట్ చేసే వీలుంటుందని ఆయన అంటున్నారు. ఇప్పటికే భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్నందున తమ బంగారం డిపాజిట్లను యథాతథంగానే ఉంచాలని ఆలయాలు డిమాండ్ చేస్తున్నది తెలిసిందే. ఈ పథకంలో భాగంగా సేకరించిన బంగారాన్ని కరిగించే వీలున్నందున నగల రూపంలో ఉన్నవాటిని అలాగే ఉంచాలని, ముడి బంగారాన్ని రిఫైన్ చేసుకోవచ్చని దేవస్థానాలు సూచిస్తున్నాయి. తమ కోరికలు తీర్చిన దేవుళ్లకు భక్తులు శతాబ్దాల కాలం నుంచి బంగారాన్ని కానుకలుగా సమర్పిస్తున్నది తెలిసిందే. ఇవి కడ్డీలు, నగలు, నాణేలు, ఇతరత్రా ఆకరాల్లో ఉండటంతోనే కరిగించే విషయంలో తమకు వెసులుబాటు ఉండాలని ఆలయాలు కోరుతున్నాయి. ఇక ‘పసిడి నగదీకరణ పథకానికి సంబంధించిన షరతుల్లో మార్పులకు ప్రభుత్వానికి మేము లేఖ రాశాం. మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లకు బంగారం రూపంలోనే వడ్డీ ఇవ్వాలి.’ అని రావు అన్నారు. ఐదు నుంచి పదిహేనేళ్ల కాలపరిమితిగల డిపాజిట్లకు దీన్ని వర్తింపజేయాలన్నారు. ‘ఈ మార్పు లు దేశంలోని అన్ని ఆలయాలను పసిడి నగదీకరణ పథకం వైపునకు ఆకర్షించేలా చేస్తాయి.’ అని అన్నారు. పసిడి నగదీకరణ పథకం విజయవంతం కావడంలో టిటిడి కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో టిడిడి డిమాండ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ప్రపంచంలో బంగారం వినియోగంలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. భారతీయ దిగుమతుల్లో చమురు తర్వాత పసిడిదే స్థానం. ప్రభుత్వం వద్దనున్న బంగారు నిల్వలుగాక దేశవ్యాప్తంగా ఇంకా 20,000 టన్నుల బంగారం ఉంది. భారత్‌లో బంగారం సెంటిమెంట్‌తో కూడుకున్నందున ఆ బంగారం అంతా కూడా ఊరికే ఇళ్లలోనే ఉండిపోతోంది. ఈ క్రమంలో పుత్తడి దిగుమతులతో ఎగిసిపడుతున్న కరెంట్ ఖాతా లోటును అదుపులో పెట్టడానికి, పసిడి దిగుమతులనూ తగ్గించడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పసిడి నగదీకరణ పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా సేకరించిన బంగారాన్ని కరిగించే మళ్లీ దేశీయ మార్కెట్‌లోకే విడుదల చేస్తారు. తద్వారా నిరుపయోగంగా ఉన్న పసిడి వాడుకలోకి రావడమేగాక, విదేశాల నుంచి దిగుమతులు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలోనే నిర్ణీత పరిమాణానికి తగ్గకుండా వ్యక్తిగత, సంస్థాగత బంగా రం డిపాజిట్లతోపాటు ఆలయాల నుంచీ పెద్ద ఎత్తున బంగారం డిపాజిట్లను ప్రోత్సహించింది. ఫలితంగా నాలుగు నెలల్లో దాదాపు 3,000 టన్నుల బంగారాన్ని బ్యాంకులు, ఇతర అనుమతి పొందిన సంస్థలు సేకరించాయి. ఇందులోభాగంగానే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 1.3 టన్నుల బంగారాన్ని టిటిడి మూడేళ్లకుగాను డిపాజిట్ చేసింది. ఇందుకు 1.75 శాతం చొప్పున వడ్డీని పొందుతుంది. ఇప్పటికే కొన్ని డిపాజిట్ల కాలపరిమితి పూర్తయిన నేపథ్యంలో మరో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో కూడా రాబోయే పదిహేను రోజుల్లో 1.4 టన్నుల బంగారాన్ని టిటిడి డిపాజిట్ చేయనుంది. దీనికి 1.25 శాతం వడ్డీరేటును పొందనుండగా, ఇందులో చాలావరకు ముడి బంగారమే ఉండటంతో దీన్ని రిఫైన్ చేయనున్నారు. మరోవైపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ముంబయిలోని శ్రీ సిద్ధివినాయక గణపతి దేవస్థానం సైతం బంగారం రూపంలో వడ్డీ ఇవ్వాలంటోంది. ఓ బ్యాంక్‌లో ఈ నెలాఖరున 44 కిలోల బంగారాన్ని ఈ దేవస్థానం డిపాజిట్ చేయనుండగా, దీన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. స్వల్పకాలిక డిపాజిట్‌నే ఎంచుకోగా, వడ్డీగా నగదే రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ నరేంద్ర మురారి రాణే తెలిపారు. అయితే తాము వడ్డీగా బంగారానే డిమాండ్ చేస్తున్నామని, ఒకవేళ బంగారం ధరలు పెరిగితే, తాము వడ్డీగా తీసుకున్న నగదు విలువ తగ్గడం వల్ల తక్కువ వడ్డీరేటుకు దేవుడి బంగారాన్ని డిపాజిట్ చేశారన్న ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందని, అదే వడ్డీగా బంగారానే్న పొందితే ఎలాంటి గొడవలుండవని రాణే అన్నారు.