బిజినెస్

బ్రిటన్‌కు టాటా స్టీల్ గుడ్‌బై?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 30: దేశం నుంచి వైదొలగాలన్న టాటా స్టీల్ నిర్ణయంతో బ్రిటన్ బెంబేలెత్తిపోతోంది. ఇదే జరిగితే వేలాది ఉద్యోగులు వీధినపడే అవకాశం ఉండటంతో ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ గురువారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఓ పక్క ఐరో పా యూనియన్‌పై రెఫరెండమ్ జరగనున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్ళు పెరగడం, దాదాపు అదే సమయంలో పిడుగుపాటిలాంటి నిర్ణయాన్ని టాటా స్టీల్ ప్రకటించడంతో మార్గాంతరం కోసం కామెరాన్ పరుగులు పెడుతున్నా రు. ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ ఉండాలా? లేదా? అనే అంశం నిర్ణయించేందుకు జూన్‌లో రెఫరెండమ్ జరుగబోతోంది. దాంతో ఇప్పటికే దేశంలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. దీంతో సొంత సమస్యలతోనే సతమతమవుతున్న కామెరాన్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. ఐరోపాలోని ఉక్కు ఉత్పత్తి చేసే సంస్థల్లో టాటా స్టీల్ రెండో స్థానంలో ఉంది. అయతే ఆర్థికపరమైన పనితీరు ప్రతికూలంగా మారడంతో ఇబ్బందుల్లో పడింది. పదేళ్ల క్రితం కోరస్ అనే సంస్థను 14 బిలియన్ డాలర్లకు టాటా స్టీల్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా దీన్ని అమ్మేయాలని నిర్ణయించింది. ఇదే జరిగితే వేలాది మం ది ఉద్యోగులకు ఇబ్బందే. ప్రస్తుతం 15 వేల మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారు. దాదా పు 5,500 మంది పనిచేస్తున్న పోర్ట్ టాల్‌బోట్ విభాగానికి రోజుకు మిలియన్ పౌండ్ల నష్టం వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అనేక మార్గాలను బ్రిటీష్ ప్రభు త్వం అనే్వషిస్తోంది. కాగా, టాటా స్టీల్ నిర్ణయమే అమలై తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి అన్నదానిపై గురువారం జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.