బిజినెస్

సంపద సృష్టిలో టిసిఎస్ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: సంపద సృష్టిలో దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టిసిఎస్ దూసుకెళ్తోంది. గడచిన ఐదేళ్లలో అన్ని సంస్థలకంటే ముందుంది. 2010-15 మధ్య కాలంలో టిసిఎస్ 3,45,800 కోట్ల రూపాయల సంపదను సృష్టించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. ఆయా సంస్థల్లో మదుపరులు పెట్టిన పెట్టుబడుల హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ సర్వే ఫలితాలు ఇవ్వడం జరిగింది. కాగా, టిసిఎస్ తర్వాత ఐటిసి (1,56,500 కోట్ల రూపాయలు), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1,54,000 కోట్ల రూపాయలు) 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సన్ ఫార్మా, హిందుస్థాన్ యునిలివర్, హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ టాప్-10లో ఉన్నాయి. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల సంపద గడచిన ఐదేళ్లలో వృద్ధి చెందినట్లు మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది.
ఇక ఇదే సమయంలో మదుపరులకు నష్టాన్ని మిగిల్చిన టాప్-10 సంస్థల్లో తొలుత ఎమ్‌ఎమ్‌టిసి నిలిచింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. మిగతా స్థానాల్లో వరుసగా సెయిల్, ఎన్‌ఎమ్‌డిసి, బిహెచ్‌ఇఎల్, జిందాల్ స్టీల్, ఎన్‌టిపిసి, హిందుస్థాన్ కాపర్, వేదాంత, టాటా స్టీల్ ఉన్నాయి. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల సంపద తరిగి పోయినట్లు తాజా సర్వేలో స్పష్టమైంది.