బిజినెస్

ఆన్‌లైన్‌లో అరకు కాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 3: ఆన్‌లైన్‌లో అరకు కాఫీ విక్రయాలకు గిరిజన సహకార సంస్థ రంగం సిద్ధం చేసింది. అరకు కాఫీకి మరింత ప్రచారం తీసుకువచ్చి ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే రిటైల్ సేల్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా నిర్వహించిన మార్కెటింగ్ ద్వారా రూ.25 లక్షల వ్యాపారం జరిపింది. అలాగే వాల్‌మార్ట్ వంటి కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్యం అయి అరకు కాఫీని దేశీయ మార్కెట్‌లోకి తీసుకువెళ్ళాలని నిర్ణయించింది. గిరిజన సహకార సంస్థ(జిసిసి), ఐటిడిఏ పాడేరు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కాఫీ ప్రాజెక్టు విజయవంతమైంది. భారతదేశంలోనే మరెక్కడా లేని సరికొత్త ప్రయోగానికి జిసిసి శ్రీకారం చుట్టింది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 1200 టన్నుల కాఫీ గింజలు సేకరించారు. రెండు వేల టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 1200 టన్నుల గింజల సేకరణ పూర్తిచేసింది. త్వరలో మరో 300 టన్నుల గింజలు సేకరించనున్నారు. ‘పాడేరు కాఫీ ప్రాజెక్టు’ పదేళ్ళపాటు అమలుకావాలనే ప్రభుత్వ ఉత్తర్వులపై గిరిజన రైతులు పండించిన కాఫీ గింజలను కొనుగోలు చేయడానికి సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రతి గిరిజన గ్రామానికి దగ్గర్లో జిసిసి డిపోలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాల ద్వారా తూచిన కాఫీ పార్చ్‌మెంట్, చెర్రీ రకాలను వేరుచేసి జిసిసి గోదాములకు తరలిస్తున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ మండలాలు పాడేరు, చింతపల్లి, గూడెం కొత్తవీధి, పాడేరు. హుకుంపేట, జి.మాడుగుల, అరకు, ముంచింగ్‌పుట్, డుంబ్రిగుడ, అనంతగిరి, కాశీపట్నం ప్రాంతాల్లోని 20 వేల మంది గిరిజన రైతులను ఈ ప్రాజెక్టులో సభ్యులుగా చేర్చారు. అలాగే మరో 15 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకోనున్నారు. వీరంతా పండించిన కాఫీ గింజలను జిసిసి సేకరిస్తుంది. ఇందుకోసం ఎంబిఎ పూర్తిగా చేసిన గిరిజన యువకులను ఆరుగుర్ని క్వాలిటీ సూపర్‌వైజర్లుగా, బిఎస్‌సి అగ్రికల్చర్ చదివిన 20 మంది గిరిజన యువకులను పూలింగ్ అసిస్టెంట్లుగా నియమించింది. వీరి ఆధ్వర్యంలో కాఫీ గింజల సేకరణ, మార్కెటింగ్ వ్యవహారాలు నిర్వహిస్తారు. దేశంలో ఒక్క కర్ణాటకలోనే కాఫీ విరివిగా పండుతోంది. ఆ తరువాత తమిళనాడులోని నీలగిరి కాఫీకి ప్రసిద్ధి. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో సంప్రయేతర కాఫీ పంట అందుబాటులోకి వస్తోంది. దేశంలో ఎగుమతిదారులతో గిరిజన సహకార సంస్థ త్వరలో సమావేశం కానుంది.