బిజినెస్

సిమెంట్ తయారీ సంస్థలపై ఆ జరిమానా చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) సిమెంట్ సంస్థలపై విధించిన 6,316.59 కోట్ల రూపాయల జరిమానాను కాంపిటీషన్ అప్పీలెట్ ట్రిబ్యునల్ శుక్రవారం రద్దు చేసింది. స్వేచ్ఛా వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్‌లో కృత్రిమ కొరత, ధరల నిర్ణయంలో కుమ్మక్కవడం వంటి ఆరోపణలతో 11 సంస్థలపై 2012 జూన్-జూలైలో సిసిఐ జరిమానాను విధించింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధిత సంస్థలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో తాజా తీర్పు వెలువడింది. కాగా, ఈ జరిమానాలో భాగంగా ఇప్పటికే డిపాజిట్ రూపంలో చెల్లించిన 10 శాతం సొమ్మును కూడా వెనక్కి తీసుకునేందుకు ఆయా సంస్థలకు ట్రిబ్యునల్ అవకాశమిచ్చింది. జరిమానా పడిన సంస్థల్లో ఎసిసి, అంబుజా సిమెంట్స్, బినాని సిమెంట్స్, సెంచురి టెక్స్‌టైల్స్ లిమిటెడ్, ఇండియా సిమెంట్స్, జెకె సిమెంట్స్, లఫర్జ్ ఇండియా, మద్రాస్ సిమెంట్స్, అల్ట్రాటెక్, జెపి అసోసియేట్స్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి. మరోవైపు కాంపిటీషన్ అప్పీలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సిమెంట్ పరిశ్రమ స్వాగతించింది. ‘మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించారంటూ సిసిఐ మాపై విధించిన జరిమానాను ట్రిబ్యునల్ కొట్టివేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ధరల విషయంలో కుమ్మకవ్వలేదు.’ అని అల్ట్రాటెక్ సిమెంట్ ఎండి ఒపి పున్మల్క పిటిఐతో అన్నారు. డిపాజిట్‌గా చెల్లించిన సొమ్మును వడ్డీతోసహా వసూలు చేస్తామన్నారు. ఇదిలావుంటే తాజా తీర్పు నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లలో సిమెంట్ సంస్థల షేర్లలో పెట్టుబడులు ఒక్కసారిగా పుంజుకున్నాయి. జెకె సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, ఎసిసి, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ల విలువ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 4.5 శాతం పెరిగాయి.