బిజినెస్

బకాయల వసూళ్లకు మాల్యాతో సంప్రదింపులు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బకాయిల వసూళ్లకు సంప్రదింపులు సరైన మార్గమని విజయ్ మాల్యా వ్యవహారంలో బ్యాంకులకు పారిశ్రామిక సంఘం అసోచామ్ సూచించింది. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయి పడినది తెలిసిందే. ఈ క్రమంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్‌ఫుల్ డిఫాల్టర్) ముద్రను కూడా మాల్యా ఎదుర్కొంటుండగా, ఇటీవల 4,000 కోట్ల రూపాయలను చెల్లిస్తానంటూ మాల్యా చేసిన ఆఫర్‌ను బ్యాంకర్లు తోసిపుచ్చాయి. ఈ నేపథ్యంలో మాల్యాతో సంప్రదింపులు జరిపి నష్టాలను తగ్గించుకోవడం మంచిదని బ్యాంకులకు అసోచామ్ హితవు పలికింది. నిజానికి 4,000 కోట్ల రూపాయలను చెల్లిస్తానని మాల్యా అనడాన్ని చూస్తే.. రుణభారం తగ్గించుకోవడంపై మాల్యా ఆసక్తితో ఉన్నట్లు అర్థమవుతోందని చెప్పింది. కాబట్టి మీడియా వార్తలను చూసో, లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదారులపట్ల కఠినంగా వ్యవహరించాలనోగాక మాల్యాతో సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరపడం ఉత్తమమని అభిప్రాయపడింది.