బిజినెస్

పెట్టుబడుల జోష్‌లో విదేశీ మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) మార్చిలో మాత్రం షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ఈ నెలలోనూ అదే దారిలో వెళ్తున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటిదాకా 7,600 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పట్టుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటు కోత, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు ఆలస్యం అవుతుందన్న సంకేతాల మధ్య ముఖ్యంగా భారతీయ స్టాక్ మార్కెట్లు ఎఫ్‌పిఐలను విపరీతంగా ఆకట్టుకున్నాయ. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య 41,661 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయతే ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో గత నెలాఖర్లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ అనంతరం పరిస్థితులు మారిపోయాయ. ద్రవ్య లోటును జిడిపిలో 3.5 శాతానికే కట్టడి చేస్తామన్న జైట్లీ వ్యాఖ్యలు స్వదేశీ మదుపరుల తోపాటు విదేశీ మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయ. ఈ క్రమంలోనే పెట్టుబడులు భారీగా తరలి రాగా, మార్చి నెలలో దేశీయ స్టాక్, రుణ మార్కెట్లలోకి ఎఫ్‌పిఐలు 19,967 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఇదిలావుంటే ఈ నెలలో స్టాక్ మార్కెట్లలోకి 3,469 కోట్ల రూపాయల పెట్టబడులను తెచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్లలోకి 4,152 కోట్ల రూపాయల పెట్టుబడు లను పట్టుకొచ్చారు. కాగా, భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తం స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువే దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలో కి తరలివచ్చాయ. అయతే 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాల ర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ 2012లో 35,000 కోట్ల రూపాయలు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46,408 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.