బిజినెస్

విదేశాలకు పోతానన్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: జైలుకు వెళ్ళడానికి కొద్ది వారాల ముందు సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ విదేశాలకు వెళ్ళాలని సుప్రీం కోర్టును కోరినట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ న్యాయవాది అర్వింద్ దతర్ తెలిపారు. బిల్ క్లింటన్, టోని బ్లెయిర్‌లతో వ్యాపారపరమైన చర్చలు జరపాల్సి ఉందని రాయ్ చెప్పినట్లు దతర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న దతర్ తన ప్రసంగంలో వెల్లడించారు. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించాయన్న వ్యవహారంలో సహారా-సెబీ సుప్రీం కోర్టులో పోరాడుతున్నది తెలిసిందే. ఈ కేసులో 2014 మార్చి 4 నుంచి తీహార్ జైళ్లో రాయ్ ఉంటున్నారు. కాగా, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయారన్న ఆరోపణల నేపథ్యంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.