బిజినెస్

12న అమెరికాకు జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం 10 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా బయలుదేరనున్నారు. అక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్), ప్రపంచ బ్యాంక్ సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల్లో ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ కూడా పాల్గొంటున్నారు. కాగా, వాషింగ్టన్ నుంచి 17న న్యూయార్క్‌కు వెళ్ళనుండగా, అక్కడ వ్యాపార, పారిశ్రామికవేత్తలు, మదుపరులతో పెట్టుబడులపై చర్చలు జరపనున్నారు. భారత్‌లో పెట్టుబడులకు వారిని ఆహ్వానించనున్నారు. 19న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సెషన్‌లో వరల్డ్ డ్రగ్ సమస్యపై మాట్లాడనున్నారు.