బిజినెస్

ఐఐపి, ద్రవ్యోల్బణం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణం గణాంకాలపై ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపట్ల నిర్ణయానికొస్తారని అభిప్రాయపడుతున్నారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా, శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని మార్కెట్లకు సెలవులు. దీంతో ఈ వారం కేవలం మూడు రోజులు మాత్రమే మార్కెట్ ట్రేడింగ్ జరగనుంది. అయితే ఫిబ్రవరి నెలకుగాను మంగళవారం ఐఐపి గణాంకాలు విడుదలవుతున్నాయి. ఇదే రోజు మార్చి నెలకుగాను వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలూ వెల్లడి అవుతున్నాయి. దీంతో మదుపరులు వీటిని అధికంగా గమనిస్తారన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా సహజంగానే ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ‘స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ కదలికలను శాసిస్తాయి. విదేశీ పెట్టుబడుల ఆధారంగా సూచీలు ఒడిదుడుకులకు లోనుకావచ్చు.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు.
ఇదిలావుంటే జనవరి-మార్చి త్రైమాసికానికిగాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాల ప్రభావం కూడా మార్కెట్లపై మొదలుకానుంది. శుక్రవారం దేశీయ ఐటిరంగ దిగ్గజం ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదలవుతున్నాయి. అయితే శుక్రవారం మార్కెట్లకు సెలవు కావడంతో ఈ ప్రభావం వచ్చే వారం మార్కెట్‌పై కనిపించనుంది. ఈ వారం కూడా ఐటి రంగ షేర్లు ప్రభావితం కావచ్చని విశే్లషకులు చెబుతున్నారు. ‘ఆర్థిక ఫలితాలు రాబోయే వారాల్లో స్టాక్ మార్కెట్లకు దశ-దిశా నిర్దేశం చేయనున్నాయని మేము విశ్వసిస్తున్నాం.’ అని సింఘానియా అన్నారు. కాగా, ఈ వారం మూడు రోజులు మాత్రమే మార్కెట్లు నడుస్తున్నందున సూచీల లాభనష్టాలు స్వల్పంగా ఉండవచ్చని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ మిడ్‌క్యాప్ రిసెర్చ్ ఉపాధ్యక్షుడు రవి షెనాయ్ అన్నారు. ఇక గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 591 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 158 పాయింట్లు నష్టపోయినది తెలిసిందే.