బిజినెస్

7,700 స్థాయికి నిఫ్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. గత కొనేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడని నేపథ్యంలో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే మించి నమోదవుతుందన్న అంచనాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. సోమవారం సైతం ఇదే కారణంతో సూచీలు భారీ లాభాలను అందుకున్నది తెలిసిందే.
ఈ క్రమంలో మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 123.43 పాయింట్లు పెరిగి 25,145.59 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 37.55 పాయింట్లు అందిపుచ్చుకుని 7,700 మార్కు ఎగువన 7,708.95 వద్ద స్థిరపడింది.
మరోవైపు పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదలవుతుండటంతో మదుపరులు ఉదయం నుంచి కొనుగోళ్ల దిశగానే నడిచారు. దీంతో ఆటో, ఇండస్ట్రీ, చమురు, గ్యాస్, యుటిలిటీస్, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 1.61 శాతం నుంచి 0.69 శాతం పెరిగింది. అయితే మెటల్ షేర్ల విలువ మాత్రం 1.38 శాతం పడిపోయింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ముగిశాయి. చైనా, తైవాన్ సూచీలు మాత్రం నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు నష్టపోగా, జర్మనీ సూచీ లాభపడింది.
మెరిసిన జ్యుయెల్లరీ షేర్లు
మంగళవారం ఆభరణాల వ్యాపార సంస్థల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బంగారు నగలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ 40 రోజులకుపైగా నిరవధిక బంద్‌ను పాటిస్తున్న నగల వర్తకుల్లో చాలామంది మంగళవారం దుకాణాలను తెరవడమే దీనికి కారణం. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో శ్రీ గణేశ్ జ్యుయెల్లరీ హౌజ్ షేర్ విలువ అత్యధికంగా 11.08 శాతం పెరిగితే, త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరి షేర్ విలువ 5.49 శాతం, గీతాంజలి జెమ్స్ షేర్ విలువ 5.03 శాతం, పిసి జ్యుయెల్లర్ షేర్ విలువ 3.57 శాతం, తారా జ్యుయెల్స్ షేర్ విలువ 1.52 శాతం ఎగిసింది.