బిజినెస్

ఎలక్ట్రానిక్ చిప్ ప్రాజెక్టును ఉపసంహరించుకున్న జెపి అసోసియేట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: వౌలికరంగ సంస్థ జెపి అసోసియేట్స్.. దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రానిక్ చిప్ ప్రాజెక్టును విరమించుకుంది. ‘సెమికండక్టర్ ప్లాంట్ ప్రతిపాదనను జెపి అసోసియేట్స్ వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ఏర్పాటు వాణిజ్యపరంగా లాభదాయకం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.’ అని ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ కార్యదర్శి అరుణ శర్మ మంగళవారం ఇక్కడ జరిగిన క్వాల్‌కమ్ కార్యక్రమం సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. కాగా, 2014 ఫిబ్రవరిలో కేబినెట్ ఆమోదం పొందిన రెండు ప్లాంట్లలో ఇది కూడా ఒకటి. రుణ భారంతో నలిగిపోతున్న జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్.. ఐబిఎమ్, ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని యుమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో 34,399 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే కేబినెట్ ఆమోదం పొందిన హిందుస్థాన్ సెమికండక్టర్స్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని శర్మ చెప్పారు.