బిజినెస్

పావు శాతం వడ్డీరేట్లు పెరగొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 11: అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వచ్చే వారం జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం వరకు పెంచే వీలుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనా వేశారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నామని, మదుపరుల భయంతో పెను నష్టాలు వాటిల్లకుండా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. శుక్రవారం ఇక్కడ ఆర్‌బిఐ 555వ సెంట్రల్ బోర్డు సమావేశం అనంతరం విలేఖరులతో రాజన్ మాట్లాడారు. కాగా, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో వాటిని వసూలు చేయడంలో బ్యాంకులు త్వరపడాలని, అశ్రద్ధ తగదని రాజన్ అన్నారు.
chitram...
విలేఖరులతో మాట్లాడుతున్న రాజన్