బిజినెస్

తెలుగు రాష్ట్రాల రైల్వేస్టేషన్లలో గూగుల్ ఉచిత వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: భారతీయ రైల్వే విభాగమైన రైల్‌టెల్ అతిత్వరలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో త్వరలోనే హైస్పీడ్ పబ్లిక్ ఫ్రీ వైఫై సేవలను ఆరంభించనుంది. ఇది రైల్‌వైర్‌గా తన విస్తృత నెట్‌వర్క్‌లో గూగుల్‌తో కలసి ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీంతో గూగుల్ దేశవ్యాప్తంగా పది ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో పబ్లిక్ వై-ఫై సేవలను అందు బాటులోకి తెస్తున్నట్లైంది. ప్రతిరోజు 2 లక్షల మందికి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసేందుకు వీలు కల్పించినట్లయింది. ఈ ఏడాది ఆరంభంలో ముంబై సెంట్రల్‌లో మొదటిసారిగా ఈ సేవలను ఆరంభించడం మొదలుపెట్టగా పబ్లిక్ వై-ఫై సేవలను అందిస్తున్న స్టేషన్ల జాబితాలో ఇక పుణె, భువనేశ్వర్, భోపాల్, రాంచి, రాయ్‌పూర్, విజయవాడ, కాచిగూడ(హైదరాబాద్), ఎర్నాకుళం (కొచి), విశాఖపట్నం కూడా చేరాయి. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభాకర్ ప్రభుచే త్వరలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయ. ఈ స్టేషన్ల గుండా ప్రయాణించే ప్రయాణికులు ఇప్పుడు సులభంగా హైడెఫినిషన్ వీడియోను చూడగలుగుతారు. తమ గమ్యస్థానం గురించి అనే్వషించుకోగలుగుతారు. కాగా, ఈ ఏడాది చివరి నాటికి దేశంలో రద్దీగల 100 రైల్వేస్టేషన్లను కవర్ చేసేలా రోజుకు 10 మిలియన్ల మందికి హైస్పీడ్ వై-ఫై నెట్‌వర్కను అందించేందుకుగాను భారతీయ రైల్వే, రైల్వేటెల్‌తో కలసి పని చేసేందుకు గూగుల్ కట్టుబడి ఉంది. మొత్తంపై ఈ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లలో ఈ సేవలను అందించనున్నారు. చిన్న స్టేషన్లను సైతం వైఫైతో కవర్ చేసేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది.

రూ. 83,000 కోట్ల పెట్టుబడులు
తీర ప్రాంత సదస్సులో 141 ఒప్పందాలు
ముంబయి, ఏప్రిల్ 15: తొలిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్న తీరప్రాంత సదస్సులో పెట్టుబడులు పోటెత్తాయి. షిప్పింగ్, పోర్టులు దాని అనుబంధ రంగాల్లో దాదాపు 83,000 కోట్ల రూపాయల (13 బిలియన్ డాలర్లు) పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఈ సదస్సును ప్రారంభించినది తెలిసిందే. ఈ క్రమంలో 82,900 కోట్ల రూపాయల విలువైన 141 ఒప్పందాలు జరిగినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా షిప్పంగ్ మంత్రిత్వ శాఖతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించిన ఒప్పందాన్ని సదస్సు సాధించిన విజయంగా పేర్కొన్నారు. కాగా, పోర్టుల అభివృద్ధే లక్ష్యంగా ప్రవేశపెట్టిన సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 240 ప్రాజెక్టుల కోసం తమ ఐదేళ్ల పాలనలో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.

భారీగా క్షీణించిన
ఆర్‌ఐఐఎల్ నికర లాభం
ముంబయి, ఏప్రిల్ 15: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్‌ఐఐఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో 51.22 శాతం క్షీణించి 279 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే వ్యవధిలో 572 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. ఇక ఆదాయం ఈసారి 2,521 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,555 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే ఈ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా సంస్థ లాభం 1,536 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం 10,089 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలియజేసింది. కాగా, 10 రూపాయల విలువైన ఒక్కో ఈక్విటీ షేర్‌కు 3.50 రూపాయల చొప్పున డివిడెండ్‌ను సంస్థ సిఫార్సు చేసింది.

స్వల్పంగా పెరిగిన
డిసిబి బ్యాంక్ నికర లాభం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ డిసిబి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) నాలుగో త్రైమాసికం, ఈ జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 10.5 శాతం పెరిగి 70 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 63 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 19.86 శాతం పెరిగి 509.56 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు 425.12 కోట్ల రూపాయలుగా నమోదైంది.
హైదరాబాద్‌లో డిసిబి నూతన శాఖ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజరాహిల్స్‌లో డిసిబి కొత్త శాఖను, డిసిబి రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ బ్యాంకు చైర్మన్ నజీర్ ముంజీ తెలిపారు. తమ బ్యాంకు 200వ బ్రాంచిని ఇక్కడ ఏర్పాటు చేయడంపట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ బ్యాంకుకు ఆంధ్రాలో ఆరు బ్రాంచిలు, తెలంగాణలో 13 బ్రాంచిలు ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఇస్తున్నామని, అగ్రిప్రాసెసింగ్ రుణాలను కూడా తమ బ్యాంకు ఇస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ రంగ అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

బజాజ్ కార్ప్
లాభం రూ. 54 కోట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ బజాజ్ కార్ప్ లిమిటెడ్.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) నాలుగో త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 54.02 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. గత జనవరి-మార్చి (2014-15) వ్యవధిలో ఈ లాభం 54.42 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి అతి స్వల్పంగా తగ్గినట్లైందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బజాజ్ కార్ప్ లిమిటెడ్ తెలిపింది. నికర అమ్మకాలు ఈసారి 227.79 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 235.42 కోట్ల రూపాయలుగా ఉన్నాయని బజాజ్ కార్ప్ లిమిటెడ్ స్పష్టం చేసింది.

హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లోకి కల్పతరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: దేశంలోని అగ్రశ్రేణి ప్రీమియం, లగ్జరీ రియల్ ఎస్టేట్ డెవలపర్ కల్పతరు లిమిటెడ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించింది. సనత్‌నగర్ వద్ద తొలి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టును శుక్రవారం ఆవిష్కరించిన అనంతరం సంస్థ ఎండి పరాగ్ మునోత్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో తమ ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సనత్‌నగర్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైనందున తమ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభిస్తుందన్న ఆశాభావాన్ని మునోత్ వ్యక్తం చేశారు.