బిజినెస్

వర్షాలు పడి, ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్లను తగ్గిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 15: వర్షాలు సమృద్ధిగా కురిసి, ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్లను మరింతగా తగ్గిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘ద్రవ్యోల్బణం కదలికలను గమనిస్తున్నాం. క్రమేణా తగ్గుముఖం పడితే రాబోయే ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాలుంటాయి.’ అని వాషింగ్టన్‌లో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో పాల్గొన్న రాజన్ పేర్కొన్నారు. ఈ నెల ఆరంభంలో జరిపిన ద్రవ్యసమీక్షలో రెపో రేటును ఆర్‌బిఐ పావు శాతం తగ్గించినది తెలిసిందే. గత ఏడాది జనవరి నుంచైతే 1.5 శాతం తగ్గించింది. మరోవైపు పన్ను ఎగవేతల అడ్డుకట్టకు భారత్, అమెరికా పరస్పరం సహకరించుకోనున్నాయి. జైట్లీ వాషింగ్టన్ పర్యటన నేపథ్యంలో ఈ మేరకు ఇక్కడ ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి.