బిజినెస్

దేశంలోని భూగర్భ గనులకు అడ్రియాల గని ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటినరికాలనీ, ఏప్రిల్ 15: దేశంలో ఉన్న భూగర్భ గనులు కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్‌లోని అడ్రియాల గనిని ఆదర్శంగా తీసుకోవాలని కోల్ ఇండియా అనుబంధ విభాగం, రాంచీకి చెందిన కోల్‌మైన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇనిస్టిట్యూషన్ (సిఎంపిడిఐ) సిఎండి శేఖర్ శరణ్ అన్నారు. శుక్రవారం ఆయనతో పాటు కోల్ ఇండియా నుండి వివిధ సంస్థలకు చెందిన 30 మంది డైరెక్టర్లు, జిఎంలు, ఇతర అధికారులు ఈ గనిలోకి వెళ్లి పనులను పరిశీలించారు. సింగరేణి సంస్థ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకుని రూ. 1,219 కోట్లతో అత్యాధునిక కెపాసిటీ కలిగిన లాంగ్‌వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని శరణ్ న్నారు. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రతి నెలా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం ప్రారంభించిందని, మరింత ఉత్పత్తి దిశగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. 2.50 లక్షల టన్నుల మేర ప్రతి సంవత్సరం బొగ్గు తీసే సామర్థ్యం గల లాంగ్‌వాల్‌లు దేశంలో ఎక్కడ లేవన్నారు. 300-600 మీటర్ల మధ్య లోతుల్లో బొగ్గు తీసే ఈ గని ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని సంస్థలు ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. కోల్ ఇండియాలో ఇటువంటి లాంగ్‌వాల్‌లు ప్రస్తుతం 7 అవసరమని, రాబోయే కాలంలో అత్యధిక లోతుల్లోంచి నాణ్యమైన బొగ్గు తీయాలంటే ఈ గనుల ప్రాధాన్యత ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. భూగర్భ గనులంటే నష్టాలు అనే అభిప్రాయం ఇకముందు అడ్రియాల గని ద్వారా వీడిపోతుందని అన్నారు. ఒక్క సంవత్సరంలోనే రూ. 15 కోట్లు లాభాలు రావడం అంటే, పూర్తి స్థాయిలో బొగ్గు తీస్తే మరింత లాభాలు వస్తాయన్నారు. దేశంలో పర్యావరణ పరిరక్షణ మరింత మెరుగు పడాలంటే ఇటువంటి గనుల తవ్వకాలు తప్పవని, భూగర్భ గనులకు అడ్రియాల లాంటి గనులు జీవం పోస్తున్నాయన్నారు. ఈ గనిలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడంపై ఆయన అభినందించారు. ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం సింగరేణి అధికారుల బృందం బొగ్గు ఉత్పత్తి సాధించి దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందారని, గనిలో వేడి తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఎయిర్ చిల్లింగ్ ప్లాంట్ ద్వారా 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిందని, కార్మికులు గనిలోకి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా డీజిల్ క్రూజర్ యంత్రాలు, మ్యాన్ రైడింగ్ యంత్రాలను గనిలోకి పంపిస్తున్నారన్నారు. దేశంలో ఇదో ‘‘మోడ్రన్ గని’’గా నిలుస్తుందని, ఇక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి గురువారం హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సెమినార్‌లో కోల్ ఇండియా స్థాయిలోని 30 మంది అధికారుల బృందం పాల్గొందనీ తెలిపారు. కోల్ ఇండియాలోని జంజ్రీలో ఇటువంటి ప్రాజెక్టు ప్రారంభించామన్నారు.
గనిలో కోల్ ఇండియా ఉన్నతాధికారుల పర్యటన
దేశంలోనే అతి పెద్ద బొగ్గు గని సంస్థ అయిన కోల్ ఇండియా సంస్థకు చెందిన పలు సంస్థల డైరెక్టర్లు, జిఎంలు అడ్రియాల గనిలో పర్యటించారు. సిఎంపిడిఐ, సిసిఎల్, ఎన్‌సిఎల్, డబ్ల్యుసిఎల్, సిఐఎంఐఆర్ ప్రతినిధులతోపాటు ఆస్ట్రేలియా సిఎస్‌ఐఆర్ సిన్‌టెస్ట్ నుండి బల్సూ శ్రీనివాస్‌రావు అడ్రియాల గనిలోకి వెళ్లారు. గనిలోకి వెళ్లే ముందు ‘‘వ్యూ’’ పాయింట్ నుండి ఈ అధికారులంతా ఓసిపి-2 క్వారీలో 220 మీటర్ల లోతుల్లో నిర్మించిన ‘‘పంచ్ ఎంట్రీ’’లను, బెల్టులను, గనికి సంబంధించి కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. గని గురించి పవర్ ప్రజేంటేషన్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గనిలోకి వెళ్లి ప్యానల్-1లో నడుస్తున్న షెరర్ యంత్రం బొగ్గు కట్ చేస్తున్న విధానం, బిఎస్‌ఎల్, ఎఎఫ్‌సి ఇతర యంత్రాల పనితీరును పరిశీలించారు. ఈ బృందం వెంట పలువురు సింగరేణి జిఎంలు పాల్గ్గొన్నారు.

వ్యూ పాయింట్ నుండి ఓసిపి-2ను
పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు