బిజినెస్

విజయ్ మాల్యా పాస్‌పోర్టు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు బాకీపడి లండన్ వెళ్లిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత, మద్యం దిగ్గజం విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దేశంలోని బ్యాంకులకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాల్యా బ్రిటన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా పాస్‌పోర్టును ప్రభుత్వం శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇడి సలహా మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఆయన పాస్‌పోర్టును నాలుగు వారాల పాటు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేయకూడదనేది వారం రోజుల్లో వివరించాలంటూ మోదీ సర్కారు మాల్యాకు నోటీసు పంపించింది. బ్యాంకు రుణాలకు సంబంధించి సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మాల్యాకు ఇప్పటికే మూడుసార్లు నోటీసులను జారీ చేసింది. అయతే స్వదేశం వచ్చేందుకు మరికొంత సమయం కావాలని మాల్యా కోరుతున్నారు. మరోవైపు విజయ్ మాల్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు లాయర్లు కోర్టుకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున తమ క్లయింట్ వ్యక్తిగతంగా కోర్టుకు రావలసిన అవసరం లేదని లాయర్లు వాదిస్తున్నారు. కాగా, రాజ్యసభ సభ్యుడైన విజయ్ మాల్యాకు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఉంది. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. దీంతో మాల్యా రాజ్యసభ సభ్యత్వం ముగిసిన వెంటనే ఆయన డిప్లొమాటిక్ పాస్‌పోర్టు కూడా రద్దయి సామాన్య పాస్‌పోర్టుగా మారుతుంది. ఈ క్రమంలో ఇడి సలహా మేరకు విజయ్ మాల్యా పాస్‌పోర్టును నాలుగు వారాలపాటు సస్పెండ్ చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 1967 పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం ఆయన పాస్‌పోర్టును సస్పెండ్ చేసినట్లు ఆ ప్రకటనలో వివరించారు. పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్ 10 (3) (సి) ప్రకారం ఎందుకు రద్దు చేయకూడదనేది వారం రోజుల్లో వివరించాలని కూడా మాల్యాకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లో ఆయన సమాధానం ఇవ్వనిపక్షంలో పాస్‌పోర్టు రద్దయిపోతుంది. డిప్లొమెటిక్ పాస్‌పోర్టు రద్దు అయిన తరువాత మాల్యా లండన్‌లో ఉండటం కష్టమైపోతుంది.