బిజినెస్

అదిరిందయ్యా సిక్కా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 15: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో అంచనాలను మించి లాభాలను అందుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చితో పోల్చితే 16.2 శాతం వృద్ధితో 3,597 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. పోయినసారి 3,097 కోట్ల రూపాయల లాభంతోనే సరిపెట్టుకుంది.
శుక్రవారం ఇక్కడ సంస్థ సిఇఒ విశాల్ సిక్కా ఆర్థిక ఫలితాలను విడుదల చేశారు. టర్నోవర్ కూడా 23.4 శాతం ఎగిసి 16,550 కోట్ల రూపాయలను తాకింది. కాగా, 2015 అక్టోబర్-డిసెంబర్‌లో ఇన్ఫోసిస్ నికర లాభం 3.8 శాతం వృద్ధితో 3,465 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సిక్కా చెప్పారు. ఆదాయం 4.1 శాతం పెరిగి 15,902 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారతీయ ఐటి ఎగుమతులు 10-12 శాతం వృద్ధి చెందవచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో నాస్కామ్ అంచనా వేసినది తెలిసిందే. ఇన్ఫోసిస్ తాజా ఫలితాల నేపథ్యంలో నాస్కామ్ అంచనాకు ఒకింత బలం చేకూరినట్లైంది. మరోవైపు 2020 నాటికి 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిక్కా చెప్పారు. 2015-16లో 9.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఇన్ఫోసిస్ అందుకున్న క్రమంలో రాబోయే ఐదేళ్లలో రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇకపోతే దేశీయంగా ఉద్యోగుల వేతనాలను 6-12 శాతం పెంచినట్లు ఇన్ఫోసిస్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. విదేశాల్లో కూడా దాదాపు 2 శాతం వేతనాలు పెరిగాయంది. కాగా, వీసాల వ్యవహారంపై సిక్కా స్పందిస్తూ విదేశాల్లో స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నారు. గత నెల బ్రసెల్స్‌లో జరిగిన తీవ్రవాద దాడిలో బలైపోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ కుటుంబానికి అండగా ఉంటామన్న భరోసానూ సిక్కా ఈ సందర్భంగా ఇచ్చారు. రాఘవేంద్రన్ సంస్థకు చాలా ఆప్తుడన్నారు.