బిజినెస్

కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఒమన్‌కు కంటైనర్ల ఎగుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, ఏప్రిల్ 17: కృష్ణపట్నం ఓడరేవు నుంచి మొదటిసారిగా ఒమన్ దేశంలోని ఫలాల ఓడరేవుకు ఆదివారం మేయరస్ బెంటోన్ విల్లా అనే విదేశీ నౌక కంటైనర్లతో బయలుదేరింది. ఈ కంటైనర్ నౌకను తొమ్మిదవ బెర్తువద్ద పోర్టు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జితేంద్ర ప్రారంభించారు. నౌక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పోర్టు అధికారులు ఘనంగా జరిపారు. కాగా, ఈ నౌకలో 12 వందల కంటైనర్లు లోడింగ్ చేసి ఒమన్ దేశంలోని ఫలాల పోర్టుకు ఎగుమతి చేశారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఓడరేవు సిఇఒ అనిల్‌కుమార్ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు ద్వారా పశ్చిమ దేశాలకు ఎగుమతులు సాగించడం శుభపరిణామంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కంటైనర్లు తీసుకెళుతున్న ఈ నౌక 4,000 కంటైనర్లు తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. కృష్ణపట్నం పోర్టు చరిత్రలో ఇదొక మైలురాయిగా భావిస్తున్నామని తెలిపారు. ఈ నౌక కంటైనర్లతో వారం రోజుల్లోనే ఒమన్ దేశానికి చేరుతుందన్నారు. కాగా, ఓడరేవు నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు ఊపందుకున్నాయని, జలమార్గం ద్వారా చేయడం వలన రవాణా ఖర్చులు తగ్గటంతోపాటు అధిక లాభాలు చేకూరుతాయని అనిల్‌కుమార్ అన్నారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కృష్ణపట్నం పోర్టు అనువుగా ఉండటంతో పశ్చిమ దేశాలు రవాణా సాగించేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాలకు ఎగుమతులు చేసేందుకు తమిళనాడు, మహారాష్టల్రలో పోర్టులు ఉన్నప్పటికీ, కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఎగుమతులు, దిగుమతులు సాగించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. రానున్న కాలంలో మరిన్ని దేశాలకు రవాణా సాగించేందుకు కృష్ణపట్నం పోర్టు సిద్ధంగా ఉందని, విదేశీ పోర్టులతో సత్సంబంధాలు కలిగి ఉంటామని ఈ సందర్భంగా సిఇఒ స్పష్టం చేశారు.

ఒమన్‌లోని ఫలాల పోర్టుకు కంటైనర్లతో బయలుదేరుతున్న
మేయరస్ బెంటోన్ విల్లా నౌక