బిజినెస్

అప్పుల్లో ఉన్న ఎంబిసిలో మాల్యాకు రూ. 1.71 కోట్ల వేతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్/వాషింగ్టన్, ఏప్రిల్ 17: విజయ్ మాల్యా అమెరికాలోని తన బ్రూవరీ సంస్థ ఎంబిసి నుంచి గత సంవత్సరం రూ. 1.71 కోట్లకుపైగా వేతనాన్ని పొందారు. అయితే ఆ సంస్థ నిధుల కొరతను ఎదుర్కొంటూ రుణదాతల నుంచి డిఫాల్ట్ నోటీసులను అందుకోవడం విశేషం. 2015లో మాల్యా పొందిన మొత్తం వేతనంలో సగానికిపైగా వేతనాన్ని కాలిఫోర్నియాలోని మెండోసినో బ్రూవింగ్ కంపెనీ (ఎంబిసి)యే చెల్లించింది. ఎంబిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా సేవలందించడంతోపాటు కంపెనీ బీర్ బ్రాండ్లను ప్రమోట్ చేసినందుకుగాను మాల్యా ఈ ప్యాకేజీని పొందారు. కింగ్‌ఫిషర్ ప్రీమియమ్ లార్జర్‌ను ఉత్పత్తి చేసి, వివిధ దేశాలలో పంపిణీ చేసే ప్రత్యేక లైసెన్సును ఎంబిసి కలిగి ఉంది. దీంతోపాటు ఈ కంపెనీ అనేక క్రాఫ్ట్ బీర్ బ్రాండ్లను కూడా తయారు చేసి అమ్ముతుంది. మాల్యా నేతృత్వంలోని యుబి గ్రూప్‌నకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యుబిహెచ్‌ఎల్) ఈ ఎంబిసిలో పరోక్షంగా మెజారిటీ వాటాలను కలిగి ఉంది. అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్‌ఇసికి 2015 సంవత్సరానికి సమర్పించిన 10-కె వార్షిక ఫామ్‌లో మాల్యాకు 256,900 డాలర్లను (సుమారు రూ. 1.71 కోట్లు) చెల్లించినట్లు ఎంబిసి పేర్కొంది. అంటే అంతకు ముందు సంవత్సరం చెల్లించినదాంట్లో ఎలాంటి మార్పు లేకుండా అంతే మొత్తాన్ని 2015లోనూ చెల్లించింది. చైర్మన్‌గా సేవలందించినందుకు విజయ్ మాల్యాకు ఎంబిసి ఏటా 120,000 డాలర్లు, తమ ఉత్పత్తులను బ్రిటన్ వెలుపల ఇతర దేశాలలో ప్రమోట్ చేసినందుకు యుబిఐయుకె 136,900 డాలర్లు చెల్లించినట్లు 10-కె ఫామ్‌లో వివరించారు. ఎంబిసికి చెందిన ఉత్తర అమెరికన్ ఆపరేషన్లలో ప్రొప్రైటరి క్రాఫ్ట్ బీర్లను తయారు చేసి అమ్మడమే ప్రధానమైనది. విదేశాలలో అమ్మకాలు తదితర కార్యకలాపాలను అనుబంధ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ ఇంటర్నేషనల్ యుకె లిమిటెడ్ (యుబిఐకె), కింగ్‌ఫిషర్ బీర్ యూరప్ లిమిటెడ్ చూస్తున్నాయి.
కింగ్‌ఫిషర్‌కు రద్దవనున్న
ఆర్‌బిఎస్ బ్యాంకింగ్ సేవలు
మరోవైపు మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పరిస్థితి. మాల్యాకు బ్యాంకర్ల నుంచి కష్టాలు కేవలం భారత్‌కే పరిమితం కావడం లేదు మరి. విదేశాల్లోనూ బ్యాంకుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఐరోపాలోని కింగ్‌ఫిషర్ బీర్ యూరప్ లిమిటెడ్ (కెబిఇఎల్)కు బ్యాంకింగ్ సేవలను నిలిపివేయాలని భావిస్తోంది గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం ఆర్‌బిఎస్. వచ్చే నెల నుంచి రుణాలు, ఇతరత్రా బ్యాంకింగ్ సేవలను రద్దు చేయాలనుకుంటోంది. దీంతో ఆర్‌బిఎస్ నుంచి ప్రస్తుతం పొందుతున్న సేవల కోసం ఇతర బ్యాంకుల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యుబి) గ్రూప్.. అమెరికాలో మెండోసినో బ్రూవింగ్ కంపెనీ (ఎంబిసి) పేరిట, ఇతర దేశాల్లో కెబిఇఎల్, యునైటెడ్ బ్రూవరీస్ ఇంటర్నేషనల్ (యుకె) లిమిటెడ్ పేరు వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. భారతీయ బ్యాంకుల నుంచి 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలను ప్రస్తుతం మాల్యా ఎదుర్కొంటున్నది తెలిసిందే. ఈ విషయంలో బ్యాం కులు కోర్టును కూడా ఆశ్రయించగా, ఈ వ్యవహారం మధ్య మాల్యా దేశం విడిచి పోరిపోయినదీ విదితమే.