బిజినెస్

జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ప్రైవేట్‌రంగ బీమా సంస్థ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ జనవరి-మార్చిలో 4.2 శాతం పెరిగి 818 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే వ్యవధిలో 786 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం క్రిందటిసారితో పోల్చితే 10 శాతం వృద్ధి చెంది ఈసారి 16,313 కోట్ల రూపాయలుగా ఉంది. షేర్ హోల్డర్లకు 216 కోట్ల రూపాయలను డివిడెండ్‌గా చెల్లించింది.
గృహ్ ఫైనాన్స్
హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ అనుబంధ సంస్థ గృహ్ ఫైనాన్స్ స్టాండలోన్ లాభం ఈ జనవరి-మార్చిలో 18.6 శాతం పెరిగి 87.82 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత సంవత్సరం జనవరి-మర్చిలో 74.06 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 366.91 కోట్ల రూపాయలుగా, పోయినసారి 304.99 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గృహ్ ఫైనాన్స్ తెలియజేసింది.
క్రిసిల్
రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఏకీకృత నికర లాభం ఈ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 40 శాతం పెరిగి 78.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 56.32 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 368.57 కోట్ల రూపాయలుగా, పోయినసారి 310.72 కోట్ల రూపాయలుగా ఉందని క్రిసిల్ స్పష్టం చేసింది. కాగా, ఈ ఏడాదికిగాను ఒక్కో షేర్‌కు 5 రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను క్రిసిల్ ప్రకటించింది.
మాస్‌టెక్
ఐటిరంగ సంస్థ మాస్‌టెక్ నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 9 శాతం క్షీణించి 5.86 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 6.44 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 124.25 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 276.11 కోట్ల రూపాయలుగా ఉంది.

‘మరో అర శాతం వడ్డీరేట్లు తగ్గొచ్చు’

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో కీలక వడ్డీరేట్లను మరో 50 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించవచ్చని మంగళవారం ఓ నివేదికలో గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఇప్పటికే ఈ నెలారంభంలో జరిపిన ఈ ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్‌బిఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయన్న అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాల మధ్య మరో అర శాతం రెపో తగ్గవచ్చని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది.