బిజినెస్

ఆర్థిక ఫలితాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్, ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకితోపాటు యాక్సిస్ బ్యాంక్, ఐడియా సెల్యులార్ తదితర అగ్రశ్రేణి సంస్థలు ఈ వారం తమ జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ క్రమంలో సూచీలు కొంత ఒడిదుడుకులకు లోను కావచ్చని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధికిగాను కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు కీలకం. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ సమావేశం కూడా ముఖ్యమే.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ఇక గత వారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఈ జనవరి-మార్చిలో రికార్డు స్థాయి లాభాలను అందుకున్నది తెలిసిందే. ఇక ఎప్పటిలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ తీరుతెన్నులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 211.39 పాయింట్లు పెరిగి 25,838.14 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 48.85 పాయింట్లు అందిపుచ్చుకుని 7,899.30 వద్ద నిలిచింది. ఇక అంతకుముందు వారంతో కూడా చూస్తే ఈ రెండు వారాల్లో సెనె్సక్స్ 1,164.30 పాయింట్లు పుంజుకుంటే, నిఫ్టీ 344.10 పాయింట్లు ఎగిసింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.94 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.24 శాతం పెరిగాయి. ఆయా రంగాల వారీగా గడచిన వారం మెటల్ 4.76 శాతం, రియల్టీ 4.08 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.07 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.01 శాతం, విద్యుత్ 0.81 శాతం, చమురు, గ్యాస్ 0.6 6 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే ఎఫ్‌ఎమ్‌సిజి 0.68 శాతం, ఆటో 0.26 శాతం చొప్పున నష్టపోయాయి. టర్నోవర్ విషయానికొస్తే బిఎస్‌ఇ 10,743. 69 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 75,491.52 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 8,967.91 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 50,35 3.08 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈసారి వర్షాలు సాధారణం కంటే అధికంగా కురుస్తాయన్న అంచనాల మధ్య ఆర్‌బిఐ రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అభిప్రాయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి.