బిజినెస్

రుణ చరిత్ర బాగుంటేనే ఉద్యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఎస్‌బిఐలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారా? అయితే మీ లోన్లు, క్రెడిట్ కార్డు చెల్లింపుల వివరాలు అంతా సరిగ్గా ఉన్నాయా? అని తప్పక చూసుకోండి. ఎందుకంటే జూనియర్ అసోసియేట్లు (కస్టమర్ సపోర్ట్, సేల్స్), క్లరికల్ కేడర్‌లో జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్స్ నియామకాల్లో ఇప్పుడు దరఖాస్తుదారుల క్రెడిట్ పూర్వాపరాలను పరిశీలిస్తోంది ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం. లోన్లు తీసుకుని సక్రమంగా చెల్లించకున్నా, క్రెడిట్ కార్డులను ఇష్టారాజ్యంగా వినియోగించుకుని బకాయిలు పేరుకుపోయినా వారిని ఉద్యోగాలకు అర్హులుగా ఎస్‌బిఐ పరిగణించదు. ఈ మేరకు ఇటీవల ఎస్‌బిఐ విడుదల చేసిన ఓ ప్రకటన చెబుతోంది మరి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సిఐబిఐఎల్) వద్ద తమ తమ రుణ చరిత్రను చూసుకోవాలని ఎస్‌బిఐ సూచిస్తోంది కూడా. ‘లోన్ల చెల్లింపుల్లో విఫలమైన, క్రెడిట్ కార్డు బకాయిలున్న, సిఐబిఐఎల్‌లో క్రెడిట్ చరిత్ర బాగా లేకున్నా మీరు మా ఉద్యోగాలకు అర్హులు కారు.’ అని ఎస్‌బిఐ ప్రకటనలో పేర్కొంది. ఎస్‌బిఐసహా 17 బ్యాంకుల నుంచి లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని, వాటిని ఉద్దేశపూర్వకంగానే ఎగవేశారన్న ఆరోపణలు, వాటిపై కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఎస్‌బిఐ నుంచి తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో వాటికి ఊతమిచ్చేలా ఉన్న ఎలాంటి బకాయిదారులకు బ్యాంకుల్లో ఉద్యోగం చేసేందుకు అర్హత లేదని ఎస్‌బిఐ భావిస్తోంది. ఇక ఎస్‌బిఐ ప్రకటనను భారతీయ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బిఇఎఫ్‌ఐ) స్వాగతించింది. అయితే విద్యా రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, బకాయిల వసూళ్లకు విఘాతం కలగకుండా చర్యలుండాలని సూచించింది.

షేల్ గ్యాస్, చమురు ఉత్పత్తి దిశగా ఒఎన్‌జిసి

హైదరాబాద్, ఏప్రిల్ 24: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి లిమిటెడ్.. 17 షేల్ గ్యాస్, చమురు బావుల్లో ఉత్పత్తికి యోచిస్తోంది. ఇందుకు దాదాపు 700 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ఇటీవల నిర్వహించిన ఓ సమావేశం ప్రకారం ఒఎన్‌జిసి పర్యావరణ అనుమతులను కూడా కోరింది. కాగా, షేల్ గ్యాస్ అనే్వషణకు ఒఎన్‌జిసి నడుం బిగించడం ఇదే తొలిసారి అని ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాక కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లో షేల్ గ్యాస్ ఉత్పత్తికి చర్యలనూ మొదటిసారిగా తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లో 11 షేల్ గ్యాస్, చమురు బావుల్లో తవ్వకాలకు పర్యావరణ అనుమతికి ప్రయత్నిస్తున్నట్లు సదరు అధికారి చెప్పారు. అలాగే తమిళనాడులో ఐదింటికి, కెజి బేసిన్‌లో ఒక దానికి సంబంధించి కూడా అనుమతులను కోరినట్లు తెలిపారు.