బిజినెస్

మళ్లీ 26 వేలకు సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ తిరిగి 26 వేల స్థాయిని అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ 7,900 మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కోలుకోవడం, అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశానికి సిద్ధమవుతుండగా ఐరోపా మార్కెట్లు లాభాల్లో కదలాడటం భారతీయ సూచీలను పరుగులు పెట్టించాయి. నిజానికి ఉదయం ఆరంభంలో దేశీయ సూచీలు సైతం నష్టాల్లోనే ఉన్నాయి. సెనె్సక్స్ 130, నిఫ్టీ 32 పాయింట్ల మేర కోల్పోయాయి. అయితే విదేశీ మదుపరుల కొనుగోళ్లతో బ్యాంకింగ్, మెటల్, రియల్టీ, ఆటో, టెక్నాలజీ, ఐటి రంగాల షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సెనె్సక్స్ 328.37 పాయింట్లు పుంజుకుని 26,007.30 వద్ద ముగియగా, నిఫ్టీ 107.60 పాయింట్లు ఎగిసి 7,962.65 వద్ద నిలిచింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.79 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.68 శాతం చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా మార్కెట్లు లాభాలను అందుకున్నాయి.

సహారా ఆస్తుల విక్రయానికి హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ సాయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: సహారా ఆస్తుల విక్రయానికి హెచ్‌డిఎఫ్‌సి రియల్టీ, ఎస్‌బిఐ క్యాపిటల్ సహాయాన్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీసుకోనుంది. నిబంధనలను అతిక్రమించి మదుపరుల నుంచి వేల కోట్ల నిధులను సహారా గ్రూప్‌లోని రెండు సంస్థలు సేకరించాయన్న కేసులో సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ రెండేళ్లుగా తీహార్ జైళ్లో ఉంటున్నది తెలిసిందే. ఈ క్రమంలో రాయ్ విడుదలకు సూచించిన 5 వేల కోట్ల రూపాయల నగదు డిపాజిట్, మరో 5 వేల కోట్ల రూపాయల విలువైన బ్యాంక్ పూచీకత్తు కోసం సహారా ఆస్తుల విక్రయానికి సుప్రీం సూచనతో సెబీ సిద్ధమవుతోంది. మరోవైపు బుధవారం ఈ కేసు సుప్రీంలో విచారణకు రానుంది.

‘పతంజలి’కి పెట్టుబడుల దన్ను
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు చెందిన ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ పతంజలి ఆయుర్వేద్.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 1,150 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. ఈ ఏడాది 10,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకోవాలనే లక్ష్యంతో పతంజలి ముందుకెళ్తున్నట్లు రామ్‌దేవ్ బాబా పిటిఐకి తెలిపారు. ఇదిలావుంటే అసోం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని కరువు ప్రాంతాల్లో పతంజలి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టనున్నట్లు సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణన్ చెప్పారు.