బిజినెస్

యాక్సిస్ లాభం రూ. 2,154 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: థేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడు అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో స్వల్పంగా తగ్గింది. గతంతో పోల్చితే 1 శాతం దిగజారి 2,154.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ లాభం 2,180.59 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఆదాయం మాత్రం పెరిగింది. ఈసారి 13,592.97 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 12,384.39 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇక మొండి బకాయిలు కూడా క్రిందటిసారితో చూస్తే పెరిగాయి. 709.82 కోట్ల రూపాయల నుంచి 1,168.33 కోట్ల రూపాయలకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం విషయానికొస్తే 20 శాతం ఎగిసి 4,553 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఇది 3,799 కోట్ల రూపాయలుగా ఉందని బ్యాంక్ సిఎఫ్‌ఒ జయరామ్ శ్రీధరన్ విలేఖరులకు చెప్పారు. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ లాభం మరికాస్త తగ్గవచ్చని హెచ్చరించారు. మరోవైపు మొత్తం గత ఆర్థిక సంవత్సరం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 12 శాతం పెరిగి 8,224 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 7,358 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 2015-16లో 50,359.50 కోట్ల రూపాయలుగా, 2014-15లో 43,843.64 కోట్ల రూపాయలుగా ఉంది.