బిజినెస్

నేడు అమ్మకానికి ఎన్‌హెచ్‌పిసి వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ప్రభుత్వరంగ జల విద్యుదుత్పాదక సంస్థ ఎన్‌హెచ్‌పిసిలో 11.36 శాతం వాటా బుధవారం విక్రయానికొస్తోంది. ఒక్కో షేర్ విలువ 21.75 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో ఈ వాటా అమ్మకంతో ఖజానాకు 2,700 కోట్ల రూపాయలకుపైగా నిధులు చేరనున్నాయి. ఎన్‌హెచ్‌పిసిలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 85.96 శాతం వాటా ఉంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వరంగ సంస్థల వాటా విక్రయాల ద్వారా 56,500 కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చమురు, ఇంధన, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ రంగాల సంస్థల నుంచి వాటాల ఉపసంహరణ జరగనుందని మంగళవారం పార్లమెంట్‌కు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు సంక్షోభంలో చిక్కుకున్న ఎరువుల తయారీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులోభాగంగానే లాభాల్లో నడుస్తున్న వివిధ ప్రభుత్వరంగ సంస్థలతో నష్టాల్లో కూరుకుపోయిన ఎరువుల ప్లాంట్లను కలిపి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.