బిజినెస్

చైనా ఓ పెద్ద ‘నకిలీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 1: నకిలీ ఉత్పత్తుల వాణిజ్యంలో భారత్.. ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. విదేశాలకు భారత్ నుంచి నకిలీ వస్తువులు ఎగుమతి అవుతున్నాయని ఆర్గనైజేషన్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒఇసిడి), ఐరోపా యూనియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ విషయంలో పొరుగు దేశం చైనా భారత్‌కే కాదు, ఏ దేశానికి అందనంత స్థాయిలో ఉండటం గమనార్హం. విదేశాల్లో దొరికిన మొత్తం నకిలీ వస్తువుల్లో చైనాలో తయారైనవే 63.2 శాతంగా ఉన్నాయి మరి. తర్వాతి మూడు స్థానాల్లో టర్కీ (3.3 శాతం), సింగపూర్ (1.9 శాతం), థాయిలాండ్ (1.6 శాతం) దేశాల ఉత్పత్తులు ఉండగా, భారత్‌లో చేసిన వస్తువులు 1.2 శాతంగా ఉన్నాయి. వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తులను పోల్చి తయారు చేయడంలో చైనీయులు దిట్టలుగా మారారని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం ఈ నకిలీ వాణిజ్యం విలువ 50 వేల కోట్ల డాలర్లుగా ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. ప్రపంచ దిగుమతుల్లో ఇది దాదాపు 2.5 శాతానికి సమానం. ఇదిలావుంటే నకిలీ ఉత్పత్తిదారులు అధికంగా అమెరికా మార్కెట్‌కు ఎగుమతులు చేస్తున్నారని, వీటివల్ల అగ్రరాజ్య వినియోగదారులు ఎక్కువగా నష్టపోతున్నారని సర్వే స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్ దేశాలకు నకిలీ వస్తువులు ఎగుమతి అవుతున్నాయని గుర్తించామంది.