బిజినెస్

పరిశ్రమలకు గడ్డురోజులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 3: తీవ్ర వర్షాభావ పరిస్థితులు విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరాపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. గోదావరి, ఏలేరు రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడంతో విశాఖ పరిశ్రమలకు నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. గత రెండు రోజులుగా విశాఖలో ప్రధాన పరిశ్రమలకు విస్కో (విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ) నీటి సరఫరా నిలిపి వేసింది. నిత్యం 30 నుంచి 35 ఎంజిడి (మిలియన్ గేలన్స్ పర్‌ఎడే) నీటిని వినియోగించే విశాఖ ఉక్కు కర్మాగారానికి విస్కో నుంచి గత రెండు రోజులుగా 4 ఎంజిడిల నీటిని మాత్రమే అందించగలిగారు. ఇక ఎన్‌టిపిసి, ఎపిఐఐసిలకు ఒక్క చుక్క నీరు కూడా పోలేదు. ఈ రెండు సంస్థలకు విస్కో ద్వారా రోజుకు 10 ఎంజిడిల నీరు సరఫరా చేయాల్సి ఉంది. సాధారణంగా గోదావరి, ఏలేరు రిజర్వాయర్ ద్వారా విస్కో రోజుకు 60 ఎంజిడిల నీటిని సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్లు అడుగంటిన నేపథ్యంలో ప్రస్తుతం గోదావరి నుంచి మూడు పంపుల ద్వారా 150 క్యూసెక్కులు, ఏలేరు రిజర్వాయర్ నుంచి ఒక పంపు ద్వారా 120 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. రెండు రోజుల కిందటి వరకూ గోదావరి నుంచి ఒక పంపు ద్వారా మాత్రమే 80 క్యూసెక్కుల నీటిని తీసుకున్నారు. అయతే తాజాగా గోదావరికి సీలేరు జలాశయం నుంచి వస్తున్న నీటి కారణంగా పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో మూడు పంపుల ద్వారా 150 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ నీరు రెండు రోజుల్లో కెబిఆర్ (కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)కు చేరుకునే అవకాశం ఉంది. ఇక ఏలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు ఈ నెల 15 వరకూ మాత్రమే సరిపోతాయి.
ఆ తర్వాత ఏలేరు నుంచి సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సరఫరా చేస్తున్న నీటిలో సైతం కోత విధించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్ నీటి నిల్వలు 90 రోజుల నుంచి 25 రోజులకు పడిపోయాయి. ఏలేరు నీటి లభ్యత ఆగిపోతే స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన నీటిని ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ఎన్‌టిపిసికి విస్కో రోజుకు 7 ఎంజిడిల నీరు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రెండు రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారు. ఎన్‌టిపిసి నీరు కేవలం 15 రోజులకు మాత్రమే సరిపోతుంది. ఇదే అంశంపై విస్కో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మే 15 తర్వాత కూడా వర్షాలు కురియని పక్షంలో విశాఖ పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. శారదానది నుంచి నీటిని తరలించే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంచినట్టు విస్కో వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా విశాఖ పారిశ్రామిక అవసరాలతోపాటు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే గోదావరి, ఏలేరు ప్రాజెక్టుల నుంచి నీరు రానిపక్షంలో ఆ ప్రభావం నగరంపై పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పారిశ్రామిక అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మేహాద్రిగెడ్డ నుంచి సామర్థ్యానికి మించి నీటిని తరలించేశారు. దీంతో మేహాద్రి నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా నగర నీటి అవసరాలను తీర్చేందుకు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జివిఎంసి దృష్టి సారించింది.

అగస్టా, టాటా జాయింట్ వెంచర్‌లో
ఎఫ్‌డిఐపై ఎఫ్‌ఐపిబి ఆరా

న్యూఢిల్లీ, మే 3: అగస్టా, టాటా జాయింట్ వెంచర్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఆరా తీస్తోంది. అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందన్న దానిపై ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఐపిబి చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. టాటా సన్స్, ఇటలీకి చెందిన రక్షణ రంగ దిగ్గజం అగస్టావెస్ట్‌లాండ్.. 2010 ఫిబ్రవరిలో ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలతోపాటు భారత సైన్యం కోసం ఎడబ్ల్యు-119 హెలికాప్టర్ల తయారీకే ఈ జాయింట్ వెంచర్.