బిజినెస్

సంస్కరణల అమలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 3: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వంటి నిర్మాణాత్మక సంస్కరణలు, భూ, కార్మిక విధానాలు.. భారత వృద్ధిరేటు పురోగతికి అత్యంత కీలకమైనవని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) పేర్కొంది. ‘్భరత వృద్ధి అవకాశాలు బాగున్నాయి. కీలక నిర్మాణాత్మక సంస్కరణల అమలు జరగకున్నా.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.’ అని ఐఎమ్‌ఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం, ప్రాంతీయ అధ్యయన శాఖ అధిపతి రనిల్ మనోహర సల్గడో అన్నారు. మంగళవారం హాంకాంగ్‌లో ఆసియా, పసిఫిక్ దేశాలకు సంబంధించి ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులపై ఓ నివేదికను ఐఎమ్‌ఎఫ్ విడుదల చేసింది. ఇందులో రాబోయే రెండేళ్లకుపైగా కాలంలో చైనా, జపాన్ ఆర్థిక వ్యవస్థలు మందగిస్తాయని అంచనా వేసింది. అయినప్పటికీ ఆసియా వృద్ధిరేటుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే భారత ఆర్థిక వ్యవస్థపై స్పందిస్తూ జిఎస్‌టి వంటి నిర్మాణాత్మక సంస్కరణల అమలు అవసరమని పిటిఐ ఈ-మెయిల్ ప్రశ్నలకు బదులుగా సల్గడో చెప్పారు. కాగా, జిఎస్‌టితోపాటు పలు కీలక బిల్లులపై ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిష్టంభన నెలకొన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి అమలు దేశ ఆర్థిక ప్రగతికి చాలా ముఖ్యమని ఐఎమ్‌ఎఫ్ అభిప్రాయపడింది. ముఖ్యంగా జిఎస్‌టి అమలుతో దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ విధానం ఉంటుందని, దీనివల్ల కలిగే ప్రయోజనాలతో దేశ జిడిపి వృద్ధి మరింత బలోపేతమవుతుందని చెప్పారు. విద్యుత్, భూ సేకరణ, కార్మిక సంస్కరణల అమలును కూడా వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంది. ఇక భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానంపైనా సల్గడో స్పందించారు. ఎఫ్‌డిఐ నిబంధనల సరళతరంతో మున్ముందు ఆ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 2015లో భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌డిఐ విలువ 44 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014లో ఇది 34 బిలియన్ డాలర్లు. ఇదిలావుంటే ఈ ఏడాది చైనా ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా, వచ్చే ఏడాది 6.2 శాతంగా ఉంటుందని ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది.