బిజినెస్

పర్యావరణంపై ప్రభావం ఉండదంటేనే అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 4: కర్మాగారం ఏర్పాటు ద్వారా పర్యావరణంపై ఎటువంటి ప్రభావం ఉండబోదని నిర్ధారించిన తర్వాతే అనుమతులు మంజూరవుతాయని స్టేట్ లెవెల్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఇఐఎఎ) ఏషియన్ పెయింట్స్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడి వద్ద రూ. 1,750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏషియన్ పెయింట్స్ యూనిట్‌కు ప్రజాభిప్రాయ సేకరణ, తదితర అంశాల్లో మినహాయింపునివ్వాలన్న అభ్యర్థనను ఎస్‌ఇఐఎఎ తోసిపుచ్చింది. ఏషియన్ పెయింట్స్ యూనిట్ స్థాపనకు పూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎపిఐఐసి) 113 ఎకరాలు కేటాయించింది. సంవత్సరానికి 4 లక్షల కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ ను ఏషియన్ పెయింట్స్ నెలకొల్పనుంది. ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు పర్యావరణపరంగా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావంటూ ఎస్‌ఇఐఎఎ నుంచి అనుమతులు తప్పనిసరి కావడంతో ఏషియన్ పెయింట్స్ సంస్థ మినహాయింపు కోరింది. మరోవైపు ఏషియన్ పెయింట్స్ యూనిట్ స్థాపించే ప్రాంతానికి సమీపంలో కొండకర్ల ఆవ ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడకు అరుదైన జాతి పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. దీంతో కర్మాగారం వల్ల ఈ జాతులకు ముప్పు వాటిల్లే అవకాశం లేదని నిర్ధారించిన మీదటే అనుమతులు ఇవ్వాలని పర్యావరణ అసెస్‌మెంట్ సంస్థ భావించినట్టు సమాచారం.