బిజినెస్

కొనసాగిన నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 4: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల పతనానికితోడు బుధవారం కూడా సూచీలు క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 127.97 పాయింట్లు నష్టపోయి 25,101.73 వద్ద ముగియగా, గత నెల ఏప్రిల్ 11 నుంచి గమనిస్తే ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 40.45 పాయింట్లు కోల్పోయి 7,706.55 వద్ద నిలిచింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 1.22 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.98 శాతం చొప్పున దిగజారాయి. అంతర్జాతీయ వృద్ధి మందగమనం, దేశీయంగా కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం మదుపరుల కొనుగోళ్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో మెటల్, ఇండస్ట్రియల్స్, రియల్టీ, ఆటో, టెలికామ్, పవర్, చమురు, గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలోనే ఆయా షేర్ల విలువ 3.49 శాతం నుంచి 1.33 శాతం మేర తగ్గింది. అటు అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్లలోనూ నష్టాలే నమోదయ్యాయ. ఆసియా మార్కెట్ల లో హాంకాంగ్, సింగపూర్, చైనా, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 1.36 శాతం వరకు పడిపోయాయి. జపాన్ మార్కెట్లకు సెలవు. ఐరోపా మార్కెట్లలో కూడా ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మార్కెట్లు 1.20 శాతం వరకు క్షీణించాయి.