బిజినెస్

కింగ్‌ఫిషర్ హౌస్ విలువపై బ్యాంకర్ల పునస్సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 4: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులను అమ్మబోయి బొక్కబోర్లా పడుతున్న బ్యాంకర్లు.. పకడ్బందీ ప్రణాళిక దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకసారి కింగ్‌ఫిషర్ హౌస్‌ను విక్రయించాలని ప్రయత్నించి దెబ్బతిన్న నేపథ్యంలో దాని అసలు విలువను సరిగ్గా అంచనా వేసే పనిలో ఇప్పుడు బ్యాంకులు నిమగ్నమయ్యాయి. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిలు రావాల్సి ఉన్నది తెలిసిందే. అయితే రుణాల వసూళ్లలో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తనఖా పెట్టిన ఆస్తులను గత శనివారం వేలం వేసిన బ్యాంకర్లకు దిమ్మ తిరిగిపోయనదీ విదితమే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్లు, ట్రేడ్‌మార్కులను దక్కించుకునేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. 366.70 కోట్ల రూపాయల రిజర్వ్ ధరతో శనివారం ఉదయం 11:30 గంటలకు మొదలైన ఆన్‌లైన్ వేలం గంట పాటు జరిగింది. రుణాలిచ్చిన బ్యాంకుల తరఫున సర్ఫేసి చట్టం కింద ఎస్‌బిఐక్యాప్ ట్రస్టీ సంస్థ వేలాన్ని నిర్వహించింది. ‘ఫ్లై ది గుడ్ టైమ్స్’ ట్యాగ్ లైన్ కలిగిన కింగ్‌ఫిషర్ లోగో, ఫ్లయింగ్ మోడల్స్, ఫన్‌లైనర్, ఫ్లై కింగ్‌ఫిషర్, ఫ్లయింగ్ బర్డ్ డివైజ్ తదితర ట్రేడ్‌మార్కులను ఈ వేలంలో అమ్మకానికి పెట్టారు. అయితే వీటికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. నిజానికి కింగ్‌ఫిషర్ విమాన కార్యకలాపాలు జోరుగా, లాభాల్లో కొనసాగుతున్న 2010లో దాని బ్రాండ్ విలువను 4,000 కోట్ల రూపాయలుగా గ్రాంట్ థ్రోంటన్ అంచనా వేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన వార్షిక నివేదికలోనూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. తమది దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అని, స్కైట్రాక్స్ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందని పేర్కొంది. అయితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిఫర్ ఎయిర్‌లైన్స్ విమాన సేవలు 2012 అక్టోబర్‌లోనే నిలిచిపోగా, 2013 ఫిబ్రవరిలో దాని లైసెన్సు రద్దవడం గమనార్హం. ఇకపోతే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ విలువ అంచనా 4,000 కోట్ల రూపాయల్లో కనీసం పదో వంతు ధరతో వాటి అమ్మకానికి ప్రయత్నించినా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. ధర అధికమన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కనీస ధరను బ్యాంకులు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రధాన కార్యాలయమైన కింగ్‌ఫిషర్ హౌస్‌ను 150 కోట్ల రూపాయలకు వేలానికి పెడితే కూడా కొనేందుకు ఎవరూ రాలేదు. దీంతో కింగ్‌ఫిషర్ హౌస్ విలువను మళ్లీ లెక్కగట్టే పనిలో బ్యాం కర్లు పడ్డారు. వచ్చే వారం ఈ ప్రక్రియ ముగియవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయ. ముంబయలోని దేశీయ విమానాశ్రయానికి సమీపంలోగల ప్లష్ విలే పార్లే ప్రాంతంలో 17,000 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో కింగ్‌ఫిషర్ హౌస్‌ను మాల్యా నిర్మించారు. బకాయలను రాబట్టుకోవడానికి ఈ మార్చి 17న 150 కోట్ల రూపాయ లకు దీన్ని వేలం వేయగా, స్పందన కరువైంది. ఇదిలావుంటే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమి ఇప్పటిదాకా దాదాపు 1,240 కోట్ల రూపాయలను వసూలు చేయగలిగాయి. అయితే ఈ వ్యవహారంపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తుండటంతో ఆ సొమ్మంతా కూడా న్యాయస్థానాల వద్దే ఉండిపోయింది. ఇక కొంతమేర చెల్లిస్తానంటూ ఇంతకుముందు మాల్యా చేసిన ఆఫర్‌కు బ్యాంకులు అంగీకరించనిది తెలిసిందే.