బిజినెస్

రూ. 37 వేల కోట్లను సమీకరించిన దేశీయ సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశీయ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-అక్టోబర్ వ్యవధిలో ప్రమోటర్లు, వాటాదారులకు ప్రాదాన్యతా క్రమంలో వాటాలు జారీ చేయడం ద్వారా 37,000 కోట్ల రూపాయలకుపైగా సమకూర్చుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2014-15) మొత్తంగా కేవలం 28,260 కోట్ల రూపాయలు మాత్రమే సమకూర్చుకున్నాయి. వ్యాపార విస్తరణ కోసం, రుణాలను తిరిగి చెల్లించడం కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వివిధ సంస్థలు ఈ నిధులను సమకూర్చుకున్నాయి. సంస్థలు నిధులను సమకూర్చుకోవడానికి ప్రిఫరెన్స్ కేటాయింపులు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా పని చేస్తాయ. ఈ విధానంలో ఆయా సంస్థలు ఎంపిక చేసిన కొంతమంది వాటాదారులకు షేర్లు లేదా కన్వర్టబుల్ సెక్యూరిటీలను జారీ చేస్తాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2015-16 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో వివిధ సంస్థలు 211 ఇష్యూల ద్వారా, ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా సమకూర్చుకున్న మొత్తం 37,257 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మొత్తంలో ఒక్క అక్టోబర్‌లోనే 16,382 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నాయి. అంతకుముందు నెలలో ఈ మొత్తం కేవలం 1,031 కోట్ల రూపాయలుగా ఉంది.