బిజినెస్

ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ వ్యాపారంలోకి హావెల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ సంస్థ హావెల్స్ ఇండియా లిమిటెడ్ ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అగ్రగామి ఆటోమేషన్ సంస్థగా గుర్తించబడిన హెచ్‌డిఎల్ ఆటోమేషన్‌తో కలిసి ఈ నూతన శ్రేణిని తన ప్రీమియం బ్రాండ్ ‘క్రాబ్‌ట్రీ’ కింద ఆవిష్కరించింది. స్మార్ట్ సిటీల అభివృద్ధిపై ప్రభుత్వాలు తాజాగా దృష్టిపెట్టడం వల్ల ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని హావెల్స్ ఇండియా లిమిటెడ్ ఉపాధ్యక్షు డు వివేక్ యాదవ్ శుక్రవారం విలేఖరులకు తెలిపారు. ఇకపై క్రాబ్‌ట్రీ ఇళ్ళు, వాణిజ్యపరమైన, హోటల్, ప్రజోపయోగ రంగాలకు కస్టమైజ్డ్ ఆటోమేషన్ సొల్యూషన్స్‌ను హావెల్స్ అందించనుందన్నారు. ‘విస్తృతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంతో పట్టణ వౌలిక వసతులను శరవేగంగా అభివృద్ధి చేయడంలో ప్రపంచంలోనే భారత్ దూసుకెళ్తోంది. ఈ సమయంలో ఆ దిశగా హావెల్స్ అడుగులు వేస్తోంది.’ అని యాదవ్ అన్నారు. 2020 నాటికి ఆటోమేషన్, కంట్రోల్ బిజినెస్ కింద రూ. 100 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా ఉన్నట్లు ఆయన ఈ కొత్త ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా తమ ఇంటితో అనుసంధానం చేసే ప్రక్రియే ఆటోమేషన్‌గా ఆయన వివరిస్తూ భద్రత, వినియోగదారుల జీవన శైలిని ఇది మెరుగు పరుస్తుందని చెప్పారు. ఈ ఆవిష్కరణ ద్వారా ఆటోమేషన్ సొల్యూషన్ ఇండస్ట్రీలో 10 శాతం వాటాను పొందాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఏప్రిల్-డిసెంబర్‌లో 40.82 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ

న్యూఢిల్లీ, మే 6: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో డిసెంబర్ నాటికి 40.82 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పార్లమెంట్‌కు తెలియజేశారు. గడచిన ఆరు ఆర్థిక సంవత్సరాల ఎఫ్‌డిఐ వివరాలను ఈ సందర్భంగా సిన్హా వెల్లడించారు. 2014-15లో 44.29 బిలియన్ డాలర్లుగా, 2013-14లో 36.05 బిలియన్ డాలర్లుగా ఉన్నాయన్నారు. ఇక 2011-12లో 46.56 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్‌డిఐ వచ్చిందన్నారు.