బిజినెస్

14 ఏళ్ల కనిష్టానికి కాగ్నిజెంట్ ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 6: ఐటి సేవల దిగ్గజం కాగ్నిజెంట్ నికర లాభం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 15.2 శాతం పెరిగి 441.2 మిలియన్ డాలర్లుగా నమోదైంది. నిరుడు జనవరి-మార్చిలో 382.9 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే అమెరికాకు చెందిన ఈ సంస్థ ఆదాయం వృద్ధి మాత్రం 14 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. 10 శాతం పెరుగుదలతో ఈసారి 3.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, పోయినసారి 2.91 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం సంస్థ ప్రకటించింది. కాగా, ఈ ఏడాది ఆదాయానికి సంబంధించి ఇంతకుముందు వేసిన అంచనాలో తాజాగా కాస్త తగ్గించింది కాగ్నిజెంట్. 13.65 బిలియన్ డాలర్ల నుంచి 14.2 బిలియన్ డాలర్లుగా 2016 సంవత్సరం ఆదాయం ఉంటుందని గతంలో కాగ్నిజెంట్ అంచనా వేసింది. అయితే ఈ అంచనాను ఇప్పుడు 13.65 బిలియన్ డాలర్ల నుంచి 14 బిలియన్ డాలర్లకు కుదించింది. ఇదిలావుంటే ప్రస్తుత త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సంస్థ ఆదాయం 3.34 బిలియన్ డాలర్ల నుంచి 3.40 బిలియన్ డాలర్లుగా నమోదు కావచ్చని కాగ్నిజెంట్ సిఎఫ్‌ఒ కరెన్ మెక్‌లాగిన్ అన్నారు. ఇకపోతే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఉద్యోగులను కాగ్నిజెంట్ బాగా పెంచుకుంది. దీంతో సంస్థ ఉద్యోగులు ప్రస్తుతం 11,300 మందికి చేరుకున్నారు.
బొగ్గు గనుల్లో
ఆధునిక రక్షణ పరికరాలు

సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ నిర్ణయం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 6: సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల రక్షణ కోసం అధునాతన రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ నిర్ణయంచారు. ప్రతి గనిలో రక్షణ ఆడిట్ తక్షణమే చేపట్టాలని ఆయా ఏరియాల జిఎంలను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన భద్రత ఏర్పాట్ల సమీక్షలో ఆయన మాట్లాడుతూ శాంతిఖని వంటి సంఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రక్షణ పెంచడానికి కావాల్సిన ఆధునిక పరికరాలను కొనుగోలు చేయాలని, వాటికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఆధునిక పరికరాల వినియోగంపై శిక్షణ కూడా ఇప్పించడం జరుగుతుందన్నారు. రక్షణ పెంచడానికి ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చినా వాటిని వెంటనే ఆమోదిస్తామని కూడా సిఎండి ఈ సందర్భంగా ప్రకటించారు.

రైతులకు ఇంధన
సామర్థ్యం పంపుసెట్లు

ఇక ఇంటి నుంచే నిర్వహణ, విద్యుత్ ఆదా

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 6: రాష్ట్రంలో రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దాదాపు 40 శాతం మేర విద్యుత్ ఆదా, కాలుష్య నియంత్రణ సాధ్యపడే ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఈపిడిసిఎల్‌లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంధన సామర్థ్యం పంపుసెట్లను వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుండగా, ఇందులో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఈపిడిసిఎల్) పరిధిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించా రు. రాజమండ్రి సమీపాన ఉన్న రాజానగరం రైతు వ్యవసాయ క్షేత్రంలో పంపుసెట్‌ను రిమోట్ ద్వారా ఆన్, ఆప్ చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఈపిడిసిఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం 2.2 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. ఇందులో ఉభయ గోదావరి జిల్లాల్లోనే 60 నుంచి 70 శాతం మేర పంపుసెట్లు రైతులు ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల విద్యుత్ ఆదా చేయాలన్నా, కాలుష్య నియంత్రణ సాధ్యపడాలన్నా ఇంధన సామర్థ్యం పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని ఈపిడిసిఎల్ యాజమాన్యం విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఇంట్లో ఉంటూనే రైతులు తమ పొలాల్లోని పంపుసెట్లకు సంబంధించిన మోటార్లను ఆపరేట్ చేసే సౌలభ్యం ఉంటుంది. సెల్‌ఫోన్‌ను రిమోట్‌గా ఉపయోగించి ఇంటి నుంచే పొలంలోని మోటార్‌ను నియంత్రించే వీలుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్‌పిడిసిఎల్), మరో ఐదు జిల్లాల పరిధిలోని ఈపిడిసిఎల్‌కు సంబంధించి మొత్తం 15 లక్షల వ్యవసాయ పంపుసెట్లు పని చేస్తున్నాయి. వీటివల్ల విద్యుత్ వాడకం విపరీతంగా పెరుగుతున్నందున 30 నుంచి 40 శాతం మేర ఆదా చేసుకునే సౌలభ్యం ఈ కొత్త విధానం ద్వారా కలుగుతుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ (ఇఇఎస్‌ఎల్) లిమిటెడ్ సహకారంతో రైతులకు దశలవారీగా వీటిని అందజేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాల్లో దాదాపు 2,700 పంపుసెట్లు పనిచేస్తుండగా వీటి స్థానంలో 90 శాతం మేర ఇంధన సామర్థ్యం పంపుసెట్లు బిగించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వెయ్యి పంపుసెట్లు బిగించగలిగారు. అలాగే రానున్న మూడేళ్లకాలంలో రెండు లక్షల పంపుసెట్లు రైతులకు పంపిణీ చేయాలని ఈపిడిసిఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇఇఎస్‌ఎల్‌తో రాష్ట్రంలోని రెండు డిస్కామ్‌లు ఎంవోయులు కుదుర్చుకున్నాయి.