బిజినెస్

టాప్-10 కంపెనీల మార్కెట్ విలువ రూ.47,932 కోట్లు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: గత వారం అత్యంత విలువైన టాప్-10 భారతీయ కంపెనీల్లో తొమ్మిది కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.47,932.69 కోట్ల మేర తగ్గిపోయింది. ఇందులో అత్యధికంగా కోల్పోయిన ఐటి దిగ్గజం టిసిఎస్ అగ్రస్థానంలో ఉంది. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ 11,408.78 కోట్లు తగ్గిపోయి 4,87, 119.34 కోట్లకు చేరుకుంది. ఒక్క హెచ్‌డిఎఫ్‌సి తప్ప ఈ జాబితాలోని ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్, ఐటిసి, ఆర్‌ఐఎల్, సిఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సన్‌ఫార్మా అన్నీ కూడా భారీగా విలువ కోల్పోయాయి. అయితే హెచ్‌డిఎఫ్‌సి విలువ మాత్రం రూ. 12,449.14 కోట్లు పెరిగింది. కాగా, మరోవైపు రెండునెలల పాటు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపిన విదేశీ పెట్టుబడిదారులు మే మొదటివారంలో మాత్రం అమ్మకాలకు దిగారు. గత వారం విదేశీ మదుపరులు దాదాపు 774 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించారు. అయితే ఇదే సమయంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు డెట్ మార్కెట్లో 769 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడం గమనార్హం.