బిజినెస్

అభివృద్ధి, ఉద్యోగాల పెంపునకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: చిన్న తరహా వ్యాపార సంస్థలు, వృత్తినిపుణులు, పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ దేశంలో అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు రెవెన్యూ విభాగం చేపట్టిన వివిధ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వివరించింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80-సి కింద వార్షిక పన్ను మినహాయింపు పరిమితిని లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని ఆర్థిక శాఖ ఒక స్పష్టం చేసింది. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన వివిధ చర్యలను ఆర్థిక శాఖ ఈ ప్రకటనలో వివరిస్తూ, చిన్నతరహా పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, వృత్తి నిపుణులకు ఊరటనిచ్చేందుకు రెవెన్యూ విభాగం పలు చర్యలను చేపట్టిందని పేర్కొంది. ముందస్తు పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే చిన్నతరహా పరిశ్రమల వార్షిక టర్నోవర్‌ను 2 కోట్ల రూపాయలకు పెంచడంతో పాటు ప్రస్తుతం ఏడాదికి 50 లక్షల రూపాయల వరకు టర్నోవర్ సాధించే చిన్న తరహా వృత్తి నిపుణలకు కూడా ఈ ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆర్థిక శాఖ వివరించింది. అలాగే కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి వసూలు చేసే కార్పొరేట్ పన్నును రేటును 25 శాతం తగ్గించి కార్పొరేట్ సంస్థలకు వెసులుబాటు కల్పించిన రెవెన్యూ విభాగం, దేశంలో నిర్మాణ పరిశ్రమను ప్రోత్సహించేందుకు వీలుగా గృహ నిర్మాణ రంగానికి కూడా పన్ను ప్రయోజనాన్ని పెంపొందించిందని, సాంకేతిక సేవలకు సంబంధించిన రాయల్టీలు, ఫీజులపై పన్ను రేటును 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిందని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్టార్టప్-ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పన్ను చెల్లింపుల నుంచి మూడేళ్లు పూర్తిగా మినహాయింపు ఇవ్వడంతో పాటు రెవెన్యూ విభాగం పలు పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించిందని, ఈ చర్యలన్నీ దేశంలో అభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి ఊతాన్నిస్తాయని ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.