బిజినెస్

కాల్ డ్రాప్స్‌పై నష్టపరిహారం చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: కాల్ డ్రాప్స్‌పై టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బుధవారం తప్పుబట్టింది. దీన్ని నిరంకుశమైన, ఆమోదయోగ్యం కాని చర్యగా అభివర్ణిస్తూ ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టింది. దీంతో టెలికామ్ సంస్థలకు పెద్ద ఊరట లభించినట్లైంది. నానాటికి పెరిగిపోతున్న కాల్ డ్రాప్స్ సమస్యకు పరిష్కారంగా వినియోగదారులకు టెలికామ్ సంస్థలు నష్టపరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ స్పష్టం చేసినది తెలిసిందే. జనవరి నుంచి ఒక్కో కాల్ డ్రాప్‌కు రూపాయి చొప్పున, రోజుకు గరిష్ఠంగా మూడు కాల్ డ్రాప్స్ వరకు నష్టపరిహారం చెల్లించాలంది. దీంతో టెలికామ్ సంస్థలకు భారీగా నష్టం వాటిల్లుతుండగా, ఈ నేపథ్యంలోనే ట్రాయ్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఒఎఐ), మరో 21 టెలికామ్ సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ట్రాయ్ నిర్ణయం చెల్లదని స్పష్టం చేసింది. నిజానికి ట్రాయ్ నిర్ణయంపై తొలుత సిఒఎఐ, టెలికామ్ ఆపరేటర్లు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా, అక్కడ ట్రాయ్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని టెలికామ్ సంస్థలు సుప్రీంలో సవాల్ చేశాయి. టెలికామ్ ఆపరేటర్ల తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదించారు. ట్రాయ్ చర్యను అనైతికంగా ఆయన కోర్టులో అభివర్ణించారు.
నిర్ణయం ట్రాయ్‌దే: ప్రసాద్
కాల్ డ్రాప్స్‌పై సుప్రీం కోర్టు తాజా ఆదేశం నేపథ్యంలో ఏం చేయాలన్నదానిపై ట్రాయ్ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అయితే టెలికామ్ సంస్థలు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. దేశవ్యాప్తంగా టెలికామ్ సేవలను సంస్థలు విస్తరిస్తే ఈ కాల్ డ్రాప్స్ సమస్యే ఉందని అన్నారు. కాబట్టి ఆ దిశగా టెలికామ్ ఆపరేటర్లు ఎందుకు వెళ్ళరంటూ ఆయన ప్రశ్నించారు.