బిజినెస్

బ్యాంకర్ల చేతికి కింగ్‌ఫిషర్ విల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, మే 13: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులను, దానికి రుణాలిచ్చిన బ్యాంకర్లు స్వాధీనం చేసుకునే పనిలోపడ్డారు. గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాను శుక్రవారం బ్యాంకులు స్వాధీనం చేసుకునేందుకు ముందుకెళ్ళాయి. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్దనున్న ఈ విల్లా విలువ 90 కోట్ల రూపాయలుగా ఉండగా, దీన్ని స్వాధీన పరచుకునేందుకు బ్యాంకులు దరఖాస్తు చేసుకున్న రెండేళ్ల తర్వాత తాజాగా ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ నీలా మోహనన్ అనుమతినిచ్చారు. దీంతో ఎస్‌బిఐ క్యాప్ ట్రస్టీ.. విల్లాకు ఓ నోటీసును అంటించింది. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడి, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా మాల్యా ముద్ర వేయించుకున్నది తెలిసిందే. దేశం విడిచి పారిపోయిన మాల్యా అరెస్టుకు కేంద్రం ప్రయత్నాలు జరుపుతున్నదీ విదితమే.