బిజినెస్

మొండి బకాయిలు ప్రమాదకర స్థాయిలో లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: మొండి బకాయిలు ప్రమాదకర స్థాయిలో ఏమీ లేవని, ఈ సమస్యను బ్యాంకులు పరిష్కరించుకోగలవని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బిబిబి) చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) ఆందోళనకర స్థాయిలో ఉన్నాయంటూ ఇటు బ్యాంకులు, అటు కేంద్ర ప్రభుత్వం కలవరపడుతున్న నేపథ్యంలో బిబిబి చీఫ్ రాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో జరిపిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మొండి బకాయిల సమస్య బ్యాంకులను వేధిస్తోంది. అయితే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతీ బ్యాంకు వద్ద ఓ వ్యూహం ఉంది. అన్ని బ్యాంకుల వద్ద వేర్వేరు వ్యూహాలున్నాయి. వాటిపైనే మేము ఇక్కడ చర్చించాం.’ అని అన్నారు. 2015 మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు 2,67,065 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, 2015 డిసెంబర్ నాటికి ఇవి 3,61,731 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇదిలావుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వరంగ బ్యాంకులకు 25,000 కోట్ల రూపాయల మూలధనం అవసరం అన్నదానిపై అడిగిన ప్రశ్నకు రాయ్ బదులిస్తూ ఈ జనవరి-మార్చికిగాను అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఆర్థిక ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎంత అవసరమన్నది తెలుస్తుందన్నారు.