బిజినెస్

సౌర విద్యుదుత్పత్తికి కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక అనుమతులు అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పే పారిశ్రామికవేత్తలు కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సౌర విద్యుత్ డెవలపర్ల సమావేశంలో మాట్లాడుతూ, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సౌర విద్యుదుత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అయతే ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. భూమి కొనుగోలులో కూడా ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. కాగా, టిఎస్ ఐపాస్, నిబంధనల కింద సౌర విద్యుత్ పారిశ్రామికవేత్తలు అనుమతులకు దరఖాస్తు చేయాలని సూచించారు. టిఎస్ ఐపాస్ కమిటీ అన్ని అనుమతులు వెంటనే ఇస్తుందన్న గ్రామ పంచాయితీల నుంచి కూడా నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం సౌరవిద్యుత్ విధానాన్ని సులభతరం చేసిందని, భూసేకరణలో అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఐపిఆర్ పాలసీని ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, మే 13: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సమగ్ర జాతీయ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపిఆర్) విధానాన్ని ప్రకటించింది. ‘క్రియేటివ్ ఇండియా: ఇన్నోవేటివ్ ఇండియా’ ట్యాగ్ లైన్‌తో ఉన్న ఈ పాలసీపై నాస్కామ్ ప్రశంసలు కురిపించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం ఈ పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.