బిజినెస్

ద్రవ్యోల్బణం 5 శాతానికి తగ్గుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని, వచ్చే ఏడాది మార్చికల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) లక్ష్యానికి అనుగుణంగా 5 శాతానికి చేరువవుతుందని ఓ రిసెర్చ్ నివేదికలో కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. గత నెల ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39 శాతంగా నమోదైనది తెలిసిందే. అధిక ఆహార ధరలే దీనికి కారణం. ఈ క్రమంలో ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో పడతాయన్న అంచనాలు నిజమైతే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని కొటక్ పేర్కొంది. గత రెండేళ్లు వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడినది తెలిసిందే. కాగా, ద్రవ్యోల్బణం ఆమోదయోగ్య స్థాయిలో ఉండటం, పారిశ్రామికోత్పత్తి పడిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ.. రెపో రేటును పావు శాతం తగ్గించినది తెలిసిందే.