బిజినెస్

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు అతిపెద్ద కార్గో విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎఎన్-225 మైరియా ఆంటోనోవాకు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్వాగతం పలికింది. ఈ భారీ కార్గో విమానం శుక్రవారం తెల్లవారు జామున అంతర్జాతీయ వినాశ్రయానికి చేరుకోగా, కోడ్ ఎఫ్ కార్గో యాప్రాన్‌లో నిలిపినట్లు జిఎంఆర్ తెలిపింది. ఎఎన్-225 కార్గో విమానంలో ఆరు సూపర్ చార్జ్‌డ్ టర్బో ఫ్యాన్ ఇంజిన్లు, ఆరుగురు సిబ్బంది ఉండగా, 640 మెట్రిక్ టన్నుల బరువును ఎత్తుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ విమానం పొడవు 84 మీటర్లు, వింగ్స్‌స్పాన్ పొడవు 88.4 మీటర్లు. ఇక ఎత్తు 18.1 మీటర్లు ఉన్న ఈ విమానం 3 లక్షల కేజీల ఇంధన నిల్వ సామర్థ్యం కలిగి ఉండి, గంటకు గరిష్ఠంగా 850 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతిపెద్ద కార్గో విమానాలను నిలిపే సాంకేతిక, రన్‌వే, ఎయిర్‌ట్రాఫిక్ నియంత్రణ వంటి సౌకర్యాలు కలిగి ఉన్న కారణంగా ఎఎన్-225 ఇక్కడకు చేరుకుంది. సెంట్రల్ ఏషియాలోని టర్క్‌మెన్‌బాషి నుంచి నేరుగా శంషాబాద్ చేరుకున్న ఈ విమానం.. మరో 24 గంటల్లో బయలుదేరి ఇండోనేషియాలోని జకర్తా విమానాశ్రయానికి చేరుకుంటుందని జిఎంఆర్ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అనంతరం తన చివరి హాల్ట్ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చేరుకుంటుంది. ప్రపంచంలో ఉన్న కొన్ని విమానాశ్రయాలకు మాత్రమే ఈ తరహా విమానం చేరుకుంటుంది. జిహెచ్‌ఐఎల్ సిఈఓ ఎస్‌జికె కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎఎన్-225 శంషాబాద్ చేరుకోవడం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. ఇది తమ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. దక్షిణాదిలోనే హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అతి పెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుగా ఉందని అన్నారు. విమానాలకు పార్కింగ్ సౌకర్యంతోపాటు 24/7 విమాన సర్వీసుల రాకపోకలు జరుగుతాయని తెలిపారు. వరుసగా ఏడేళ్లపాటు అంతర్జాతీయ స్థాయి టాప్ 3 ర్యాంకు సాధించామని చెప్పారు. తమ విమానాశ్రయం ఏడాదికి లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సదుపాయం కలిగి 14,330 చదరపు మీటర్ల పరిధిలో కార్గో సౌకర్యం ఉందని పేర్కొన్నారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అతిపెద్ద కార్గో విమానం