బిజినెస్

మొండి బకాయిలపై త్వరలో కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: సుప్రీం కోర్టు సూచనల నేపథ్యంలో బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ)పై త్వరలో ఓ కమిటీని వేయనుంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. మొండి బకాయిలకు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ తివారి, ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్‌కె జైన్, ప్రముఖ న్యాయ నిపుణుడు ఎమ్‌ఆర్ ఉమర్జీ తదితరులు ఈ కమిటీలో ఉంటారని సమాచారం. దేశీయ బ్యాంకింగ్ రంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న నిరర్థక ఆస్తుల సమస్యపై గత నెల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ థాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ మొండి బకాయిలకు కారణాలు, వాటి తీవ్రతను పరిశీలించడానికి ఓ కమిటీని వేయాలని ప్రభుత్వానికి సూచించింది. మొండి బకాయల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు భారీగా తగ్గుతుండగా, మరికొన్ని బ్యాంకులైతే భీకర నష్టాలనే నమోదు చేస్తున్నాయ.