బిజినెస్

జనవరి-ఏప్రిల్ వ్యవధిలో 43 శాతం క్షీణించిన స్టాక్ మార్కెట్ల టర్నోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 15: ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్ వరకు దేశీయ ప్రధాన స్టాక్ మార్కెట్ల టర్నోవర్ 43 శాతం క్షీణించింది. తొలి నాలుగు నెలల్లో 15.95 లక్షల కోట్ల రూపాయలకే పరిమితమైంది. నిరుడు ఇదే నాలుగు నెలల్లో 28.02 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ నమోదవడం గమనార్హం. దేశంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లైన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, ఎమ్‌సిఎక్స్-ఎస్‌ఎక్స్‌ల టర్నోవర్ వివరాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌లో ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 13.64 లక్షల కోట్ల రూపాయలుగా, బిఎస్‌ఇ టర్నోవర్ 2.3 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఎమ్‌సిఎక్స్-ఎస్‌ఎక్స్ (ఎమ్‌ఎస్‌ఇఐ) టర్నోవర్ 57 కోట్ల రూపాయలుగా ఉంది. నగదు లావాదేవీల్లో దేశంలోని అన్ని స్టాక్ మార్కెట్లలో 99.9 శాతం వాటా ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇలదే. నగదు విపణిలో ఎన్‌ఎస్‌ఇ వాటా 85.4 శాతంగా ఉంటే, బిఎస్‌ఇ వాటా 14.5 శాతంగా ఉంది. కాగా, నిరుడు జనవరి-ఏప్రిల్‌లో ఎమ్‌ఎస్‌ఇఐ క్యాష్ టర్నోవర్ కేవలం 95 లక్షల రూపాయలుగానే ఉంది. అయితే ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌లో 57 కోట్ల రూపాయలకు ఎగిసింది. ఇకపోతే గత నెల ఏప్రిల్‌లో ఎన్‌ఎస్‌ఇ ఈక్విటీ మార్కెట్ టర్నోవర్ 18 శాతానికిపైగా దిగజారి 3.57 లక్షల కోట్ల రూపాయలకు చేరగా, బిఎస్‌ఇ ఈక్విటీ మార్కెట్ టర్నోవర్ 27 శాతం పతనమై 49,174 కోట్ల రూపాయలుగా ఉంది.